కొయ్యలగూడెం: కొయ్యలగూడెం – బయ్యన్నగూడెం మార్గ మధ్యలో ఉన్న పులివాగు పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని శనివారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దర్శించారు.
ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తదుపరి ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆలయ నిర్వాహకులతో ఎమ్మెల్యే చర్చించారు. ప్రాంతీయ ప్రజలు, భక్తులందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.



.jpeg)