జంగారెడ్డిగూడెం, మార్చి 10: మంగళవారం సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువుగా వెలిసిన శ్రీ స్వామి వారి దర్శనం కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి మాత్రమే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
భక్తులు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. అలాగే స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసన, వాహన పూజలు వంటి ప్రత్యేక సేవలను ఆలయ అర్చకుల చేత నిర్వహించుకున్నారు.
మంగళవారం మధ్యాహ్నం / సాయంత్రం 5 గంటల వరకు స్వామి వారి దర్శనానికి వచ్చిన సుమారు 1719 మంది భక్తులకు దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన సత్రంలో అన్నప్రసాదం వితరణ చేశారు. అలాగే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపంలో మొత్తం రూ.2,09,929 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఆర్.వి. చందన తెలిపారు.



.jpeg)