Ticker

6/recent/ticker-posts

కోడి పందాల స్థావరంపై దాడి – 8 మంది అదుపులో.. రూ. 8,100 నగదు, 3 కోడి పుంజులు స్వాధీనం


దెందులూరు, మార్చి 1: దెందులూరు మండలం పెరుగుగూడెం గ్రామ శివారు గోవిందపురం వద్ద నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8,100 నగదు మరియు 3 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి ప్రసాద్ సూచనలతో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా పెదవేగి సీఐ సి.హెచ్. రాజశేఖర్ ఆధ్వర్యంలో దెందులూరు ఎస్ఐ శివాజీ తమ సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించారు.

కోడి పందాలు జరుగుతున్నాయనే సమాచారంతో పెరుగుగూడెం శివారు గోవిందపురం ప్రాంతంలో ఆకస్మికంగా దాడి చేసి కోడి పందాలు నిర్వహిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద ఉన్న నగదు మరియు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దెందులూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా ఎస్ఐ శివాజీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాల నివారణ కోసం మారుమూల ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేకాట, కోడి పందాలు, మద్యం అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు.

ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.