రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమీషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ ను మర్యాద పూర్వకంగా కలసి జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు పూలమొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు ...
ఏలూరు: స్థానిక రెవిన్యూ అతిధిగృహంలో శుక్రవారం ఏలూరు జిల్లాకు ఒక్క రోజు పర్యటనకు వచ్చిన రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ ను మర్యాద పూర్వకంగా కలసి జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు పూలమొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు.
స్వాగతం పలికిన వారిలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీరామకృష్ణ, ఏపి యస్సి కార్పొరేషన్ డైరెక్టరు దాసరి ఆంజనేయులు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, జిల్లా సాంఘీక సంక్షేమశాఖ ఉప సంచాలకులు వై.విశ్వమోహన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం. ముక్కంటి, తహశీల్దారు కె.గాయత్రిదేవి, సంబంధిత అధికారులు, జిల్లా సాంఘీక సంక్షేమశాఖ అధికారులు, టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు పెద్దాడ రమణ, ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబరు తాళ్లూరి రాణి, దొడ్డిగర్ల సుభా మల్లిక్, మాజీ సభ్యులు మేతర అజయ్ బాబు, యంఆర్ పి యస్ నాయకులు బియ్యపు రాజేశ్వర రావు, ఎస్సీ సంఘాలు నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, స్థానిక ప్రజలు, పెద్దఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారు.


.jpeg)
