Ticker

6/recent/ticker-posts

తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చంటికి పూల మొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన SR TV అధినేత సత్య రాజ్


ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఏలూరు శాసన సభ్యుడు బడేటి రాధాకృష్ణయ్య(చంటి )ని SR TV అధినేత, సోషల్ వర్కర్స్ లీడర్ సింగం శెట్టి సత్యనారాయణ(సత్తిరాజు) కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సత్తి రాజు, నూతనంగా నియ మితుడైన ఆయన్ను మిత్రులు జెట్టి ఉమా తదితరులతో ఏలూరులోని ఎమ్మెల్యే కార్యాలయానికి వెల్లి చంటిని కలిసి పూల మొక్కను ఇచ్చి శుభాకాంక్షలు తెలపారు.

దివంగత ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి )తో కూడా తనకు అనుబంధం ఉందని స్నేహితులను ఆయన ఎంతో గౌరవించే వారని ఈ సందర్భంగా గుర్తు జేసుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవిని కాపు నేతకు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారని అర్ధం అవుతుందని సత్తి రాజ్ అన్నారు. ఇది జిల్లాను అభివృద్ధి పధంలో నడిపించే ఆలోచన అని కూటమి ప్రభుత్వం పాలన జన హితంగా సాగుతున్నదని కొనియాడారు.