ఏలూరులో ఘనంగా 'అటల్-మోడీ సుపరిపాలన యాత్ర'
కాంగ్రెసేతర సుపరిపాలన సాధ్యమని నిరూపించిన ధీశాలి అటల్ జీ తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై
రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో వాజ్ పేయి విగ్రహాల ఏర్పాటు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్
ఏలూరు, డిసెంబర్ 22: కాంగ్రెసేతర ప్రభుత్వంతోనూ దేశంలో అద్భుతమైన సుపరిపాలన అందించడం సాధ్యమని నిరూపించిన ధీశాలి అటల్ బిహారీ వాజ్ పేయి అని తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షులు కె. అన్నామలై కొనియాడారు. సోమవారం ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ సెంటర్ వద్ద భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని అన్నామలై, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆవిష్కరించారు.
అనంతరం 'అటల్-మోడీ సుపరిపాలన యాత్ర'లో భాగంగా నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్, మంత్రి కొలుసు పార్థసారథి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణ, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, నిర్మల కిషోర్ తదితర ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథి అన్నామలై మాట్లాడుతూ నాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని జైలులో అన్యాయంగా చంపివేయడంపై చలించి, ఆ ఆశయ సాధన కోసమే వాజ్ పేయి రాజకీయాల్లోకి వచ్చారు అని పార్లమెంటులో కేవలం ఇద్దరు సభ్యులతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు దేశాన్ని తిరుగులేని శక్తిగా పాలిస్తోందంటే దానికి అటల్ జీ వేసిన బలమైన పునాదులే కారణం అన్నారు. 1999 లో వాజ్పాయ్ ప్రధానిగా, ఎన్డీఏ కన్వీనర్‌గా చంద్రబాబు ఉన్నారని ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో 19 వాజ్ పేయి విగ్రహాలు ఏర్పాటు కావడం గొప్ప విషయం అన్నారు.
ఆనాటి స్నేహం, అదే సుపరిపాలన నేడు మళ్ళీ రాష్ట్రంలో కనిపిస్తోంది అని పేర్కొన్నారు. ఈ నెల 25న సీఎం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మరో భారీ విగ్రహావిష్కరణ జరగనుండటం నిబద్ధతకు నిదర్శనం అన్నారు."13 రోజులు, 13 నెలలు ప్రధానిగా పనిచేసినా, ఆ తర్వాత 1999 నుండి 2004 వరకు పూర్తి కాలం పదవిలో ఉండి రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు వాజ్ పేయి నిలువుటద్దంగా నిలిచారని పేర్కొన్నారు. నేషనల్ హైవే డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా దేశవ్యాప్తంగా కనెక్టివిటీ పెంచి అభివృద్ధికి బాటలు వేశారు అని రాష్ట్రవ్యాప్తంగా అటల్-మోడీ సుపరిపాలన యాత్రను నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్న పి.వి.ఎన్. మాధవ్ గారి కృషి మరువలేనిది అని అభినందించారు.
నైతిక విలువలకు కేరాఫ్ అడ్రస్ అటల్ జీ: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ అటల్ జీ నైతిక విలువలకు కేరాఫ్ అడ్రస్ అని ఒక్క ఓటుతో పదవి పోతుందని తెలిసినా విలువల కోసం ప్రధాని పదవినే త్యాగం చేసిన హిమాలయమంతటి వ్యక్తిత్వం ఆయనది అన్నారు. అణు పరీక్షలతో దేశ రక్షణను పటిష్టం చేసిన ధీశాలి ఆయన." అని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో విగ్రహాల ఏర్పాటు: పి.వి.ఎన్. మాధవ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ రాబోయే తరాలకు అటల్ జీని స్ఫూర్తి ప్రదాతగా నిలిపేందుకు రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్డీఏ కూటమి నాయకుల సహకారం ఈ విషయంలో అభినందనీయమన్నారు.
సుపరిపాలనకు నాంది: మంత్రి కొలుసు పార్థసారథి
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ దేశంలో సుపరిపాలనకు వాజ్ పేయి నాంది పలికారని, ఆయన వేసిన పునాదులపైనే నేడు మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, నిర్మల కిషోర్, బిజెపి జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు చైర్మన్లు, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
.jpeg)

.jpeg)
