Ticker

6/recent/ticker-posts

ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ గ్రేడ్-1 గా ఉన్నతి


అభివృద్ధిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఖాతాలో మరో మైలురాయి


ANDRAPRADESH, జంగారెడ్డిగూడెం: పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన కూటమి నాయకులు విలేఖరుల సమావేశం నిర్వహించడం జరిగింది... పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే రోషన్ కుమార్ కృషితోనే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ గ్రేడ్-2 స్థాయి నుండి గ్రేడ్-1 గా మున్సిపాలిటీగా ఉన్నతి సాధించామని, దాంతో పట్టణం ప్రజల హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారని, అంతేకాకుండా ఇటీవల ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో పట్టణ మాస్టర్ ప్లాన్ కూడా ప్రభుత్వం అప్రూవల్ చేసిందని అన్నారు..

చింతలపూడి జనసేన పార్టీ ఇంచార్జ్ మేకా ఈశ్వరయ్య, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, బిజేపి నాయకులు కొప్పాక శ్రీనివాస్, టిడిపి సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, బొబ్బర రాజ్ పాల్ మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో శాసనసభ్యులు రోషన్ కుమార్ పట్టణ టిడిపి నాయకులతో కలిసి మున్సిపల్ శాఖమంత్రి పి. నారాయణని, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ని సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారని, అనంతరం నిరంతర పర్యవేక్షణ జరిపి నేడు గ్రేడ్ వన్ గా ఉన్నతి సాధించిందని, ఈ మేరకు ప్రభుత్వం జీవో 243 విడుదల చేయడంతో పాటు గెజిట్ కూడా విడుదల చేసిందన్నారు.


దీంతో కేంద్రం నుండి పట్టణాభివృద్ధికి వచ్చే నిధుల రాకకు జలజీవన్ మిషన్ 2.0 క్రింద నిధుల లభ్యతకు మార్గం సుగమం కానుందని, గత వైసిపి పాలనలో పట్టణాన్ని ఏ విధంగా  కూడా అభివృద్ధి చేయలేక పోయినప్పటికీ శాసనసభ్యులు రోషన్ కుమార్ ఏడాదిన్నర కాలంలోనే గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా మరియు మాస్టర్ ప్లాన్ అప్రూవల్ చేయించి పట్టణ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు..

ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరావు, పెనుమర్తి రామకుమార్, బురుజు ఉమామహేశ్వరి, బిజెపి పట్టణ అధ్యక్షులు సుధాకర్, రాజాన సత్యనారాయణ, మహంకాళి రాంబాబు, చిట్రోజు తాతాజీ, ఇనగడప రామాంజనేయులు, తూటికుంట రాము, సత్యవరపు బుల్లియ్య, షేక్ యాకుబ్, షేక్ నజీర్, గెడా సుబ్రహ్మణ్యం, కరణం రాంబాబు, నాయుడు శ్రీను, తానిగడప సుమలత మరియూ కూటమి నాయకులు పాల్గొన్నారు..