Ticker

6/recent/ticker-posts

ఏపీ నుంచి రాజ్యసభకు మాజీ ప్రధాని...మాజీ సీఎం ?


ఏపీ నుంచి రాజ్యసభకు మరో నాలుగు సీట్లు ఖాళీ అవుతాయి. అయితే దానికి మరో 11 నెలల సమయం ఉంది.

ANDHRAPRADESH:ఏపీ నుంచి రాజ్యసభకు మరో నాలుగు సీట్లు ఖాళీ అవుతాయి. అయితే దానికి మరో 11 నెలల సమయం ఉంది. 2026 జూన్ నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ అవుతాయి. వాటికి సంబంధించి నామినేట్ అయ్యేవారి పేర్లు ఇప్పటి నుంచే ప్రచారంలో ఉండడం విశేషం.

బీజేపీ తనకు ఒక సీటు, తన మిత్రపక్షానికి ఒక సీటు ఏపీ కోటాలో కావాలని ముందే కర్చీఫ్ వేసిందని అంటున్నారు. పక్కన ఉన్న కర్ణాటకకు చెందిన సీనియర్ నేత జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని అయిన దేవేగౌడ రాజ్యసభ సభ్యత్వం వచ్చే ఏడాదితో పూర్తి అవుతోంది. దాంతో ఆయనను ఏపీ కోటా నుంచి పంపించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు.

కర్ణాటకలో జేడీఎస్ బీజేపీల మధ్య పొత్తు ఉంది. దాంతో 2024 లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను రెండు పార్టీలు సాధించాయి. ఇక దేవెగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం అయిన కుమారస్వామి కేంద్రంలో కీలకమైన ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు. 

మరో వైపు చూస్తే దేవెగౌడ కుమారస్వామిలతో టీడీపీ అధినేత చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో బీజేపీ ఈ ప్రతిపాదన తెస్తున్నట్లుగా అయితే ప్రచారం సాగుతోంది. దాంతో దేవెగౌడ సీటు కన్ఫర్మ్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు.

అంతే కాదు బీజేపీ కోటాలో మరో సీటు కోరుతున్నారని అంటున్నారు. ఆ సీటుని రాయలసీమకు చెందిన నాయకుడు ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పించి ఆయనను పెద్దల సభకు తీసుకుని రావాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. 

ఇప్పటికే ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే అందులో రెండు ఆ పార్టీ తీసుకుంది. ఒకదానిని ఆర్ క్రిష్ణయ్యకు మరోదానిని పాకా సత్యనారాయణకు ఇచ్చారు. 2026లో ఖాళీ అయ్యే నాలుగింటిలో మళ్ళీ రెండు సీట్లు బీజేపీ కోరుతోంది అని అంటున్నారు

ఇక ఆ మిగిలిన రెండింటిలో టీడీపీ 2024లో రాజ్యసభకు పంపించిన పారిశ్రామికవేత్త సానా సతీష్ కే మరోసారి రెన్యూవల్ చేయవచ్చు అని అంటున్నారు. ఇక జనసేనకు ఈ తడవ ఒక సీటు కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఆ సీటుని మరో పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కి ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది.

మొత్తానికి చూస్తే 2026 జూన్ లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ సీట్లకు ఇప్పటి నుంచే అభ్యర్థులు ఖరారు అయిపోయారా అన్నదే చర్చగా ఉంది. ఇక వరసబెట్టి రాజ్యసభ సీట్లను ఏపీ నుంచి బీజేపీ తీసుకుంటే టీడీపీలోని ఆశావహులకు ఎలా అన్నది కూడా మరో వైపు చర్చగా ఉంటోంది. టీడీపీలో సీనియర్లు అనేకమంది రాజ్యసభ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారని అంటున్నారు. ఈ పేర్లే కనుక ఫైనల్ అయితే మాత్రం వారంతా మరింత కాలం నిరీక్షణతో గడపాల్సిందే అని అంటున్నారు.