15 ఏళ్లుగా తన అన్న శ్రీనివాసులు (రాయుడు) జనసేన పార్టీలో వినుత వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడని ఆయన సోదరి కీర్తి తెలిపారు. తాజాగా తన అన్న కాలుకి దెబ్బ తగిలిందని చెప్పి పిలిపించారని, అక్కడికి వెళ్తే ఐదుగురు కూర్చుని మధ్యలో ఆయన్ను కూర్చోబెట్టి ఉంచారన్నారు. తమను ఏమీ మాట్లాడనివ్వలేదన్నారు. కాలుకు దెబ్బతగిలిందని మాత్రమే చెప్పారన్నారు. ఆ తర్వాత తన అన్నను చంపేశారన్నారు. అప్పుడు తమకు కనిపించిన ఐదుగురే ఈ హత్య కేసులో ఉన్నారన్నారు.
దీన్ని ఇంతటితో వదిలేది లేదని, తమకు న్యాయం చేయాలని కీర్తి తెలిపింది. తాము నమ్ముకున్న జనసేన పార్టీ ద్వారానే న్యాయం జరగాలని కోరుకుంటున్నామని, అక్కడ న్యాయం జరగకపోతే వేరే పార్టీ ద్వారా అయినా పోరాటం చేస్తామన్నారు. నిందితుల్ని పోలీసు స్టేషన్ లో ఉంచి కొన్ని రోజులు తర్వాత వదిలేస్తే ఇంకొకరికి ఇలాగే జరిగే అవకాశం ఉందన్నారు. నిందితుల్ని ప్రాణాలతో వదలమని తేల్చిచెప్పేశారు. వాళ్లను కూడా ఏదో ఒకటి చేయాలన్నారు. ఈ విషయం పవన్ వరకూ వెళ్లాలన్నారు.
నిందితులు బయటికి వస్తే తమ ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. తమ అవ్వను కోట వినుత మనుషులు తీసుకెళ్లారని, డబ్బు ఇచ్చి తమను కొనాలని ప్రయత్నించారన్నారు. అయితే తాము లొంగలేదన్నారు. జనసేన పార్టీని తమకు న్యాయం చేయాలని కీర్తి కోరింది. అలా జరగకపోతే వేరే పార్టీ ద్వారా పోరాడతామన్నారు. ఎంత తప్పు చేసినా తమ అన్నను చంపే హక్కు వారికి లేదన్నారు
Social Plugin