Ticker

6/recent/ticker-posts

నెక్స్ట్ జరిగేది అదే, ఆపగలవా - పవన్ కు పేర్ని సవాల్..!


ANDHRAPRADESH:డిప్యూటీ సీఎం పవన్ కు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారని.. వారిని రానివ్వమంటూ పవన్ చేసిన వ్యాఖ్యల పైన మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. పవన్ తన కార్యాకర్తలనే పట్టించుకోవటం లేదని.. తన శాఖల్లో ఏం జరుగుతుందో తెలియదని ఎద్దేవా చేసారు. ఈ సారి జగన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నార ని పేర్ని నాని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సైకో బ్యాచ్ రెచ్చిపోతుందని మండిపడ్డారు.

డిప్యూటీ సీఎం పవన్ లక్ష్యంగా పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో టీడీపీ సైకో బ్యాచ్ రెచ్చిపోతోందని, అరాచకం సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ సర్పంచ్‌ నాగమల్లేశ్వర రావు పై పట్టపగలు నడిరోడ్డుపై టీడీపీ గుండాలు అత్యంత కిరాతకంగా చేసిన దాడిని చూసి మొత్తం రాష్ట్రం అంతా ఉలిక్కిపడిందని అన్నారు. అధికార మదంతో, కన్నూమిన్నూ కానకుండా తెలుగుదేశం ఉన్మాదులు రక్తపాతం సృష్టిస్తుంటే, కూటమి నేతలు వారిని ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రాన్ని నరకాసుర రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా కూటమి నేతల రౌడీయిజం, గుండాగిరీతో అరాచక పాలన కనిపిస్తోందన్నారు.

కూట‌మి పార్టీలు 164 సీట్లు గెలిచిన‌ప్ప‌టికీ మ‌న్న‌వ గ్రామంలో మాత్రం వైయస్ఆర్‌సీపీ కే మెజార్జీ వ‌చ్చిందని గుర్తు చేసారు. దానికి నాగ‌మ‌ల్లేశ్వ‌ర రావు నాయ‌క‌త్వ‌మే కార‌ణ‌మ‌ని తెలుసన్నారు. త‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం గ్రామంలోని ప్ర‌త్య‌ర్థుల‌ను రెచ్చ‌గొట్టి నాగ‌మ‌ల్లేశ్వ‌ర రావు హ‌త్య‌కు ప్రేరేపించా రని ఆరోపించారు. గ్రామాల్లో అశాంతి, అల్ల‌ర్లు సృష్టించి రాజ‌కీయంగా ల‌బ్ధి పొంద‌డం ధూళిపాళ్ల‌కు వెన్న‌తో పెట్టిన విద్య అంటూ మండి పడ్డారు. పవన్ ను క‌ల‌వాలంటే ప‌క్క రాష్ట్రంలో షూటింగ్ స్పాట్‌కి వెళ్లాలేమో అని ఎద్దేవా చేసారు. ఐపీయ‌స్‌లు సైతం భ‌య‌ప‌డి రాజీనామాలు చేసి వెళ్ లిపోతున్నారననారు. జ‌గ‌న్‌ని మ‌ళ్లీ అధికారంలోకి రానివ్వ‌ను అనడానికి ప‌వన్ క‌ళ్యాణ్ ఎవ‌రని నాని ప్రశ్నించారు. జగన్‌ గురించి మాట్లాడే స్థాయి పవన్‌కు లేదన్నారు.

చంద్ర‌బాబుకి న‌ష్టం జ‌రిగిన‌ప్పుడు మినహా ఎప్పుడైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌య‌ట‌కొచ్చారా అని నిలదీ సారు. జ‌గ‌న్ మ‌ళ్లీ రావాలా వ‌ద్దా అనేది నిర్ణ‌యాల్సింది ప్ర‌జ‌లే తప్ప ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబు కాదన్నారు. మ‌ళ్లీ ఈవీఎంల‌ను మేనేజ్ చేసి గెల‌వ‌చ్చ‌నే ధైర్యంతోనే జ‌గ‌న్‌ని అధికారంలోకి రానివ్వ‌న‌ని చెబుతున్నాడ‌ని బ‌య‌ట మాట్లాడుకుంటున్నారని వివరించారు. అందుకే బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని మా పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. జ‌న‌సేన పార్టీ టెంట్ హౌస్‌లాగా అద్దెకిచ్చే పార్టీ అని చెప్పుకొచ్చారు. సొంతంగా గెల‌వ‌లేక అంద‌రూ ఒక్క‌టై ప్ర‌జ‌ల‌ను దోచుకుంటున్నారని మండిపడ్డారు. అది చేస్తా, ఇది చేస్తా అని ఎన్నిక‌ల‌కు ముందు చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, అధికారంలోకి వ‌చ్చిన ఏడాది కాలంగా ఎక్క‌డున్నారని నాని నిలదీసారు.