కూటమి ప్రభుత్వంలోని మంత్రులకు సబ్జెక్టు సమస్య పట్టుకుందట. దీనిపై పెద్ద ఎత్తున మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది. సాధారణంగా నిత్యం.. సచివాలయాల్లో మంత్రులకు, మీడియా మిత్రులకు మధ్య అనేక సంభాషణలు జరుగుతుంటాయి.
ANDHRAPRADESH:కూటమి ప్రభుత్వంలోని మంత్రులకు సబ్జెక్టు సమస్య పట్టుకుందట. దీనిపై పెద్ద ఎత్తున మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది. సాధారణంగా నిత్యం.. సచివాలయాల్లో మంత్రులకు, మీడియా మిత్రులకు మధ్య అనేక సంభాషణలు జరుగుతుంటాయి. అయితే.. ఇటీవల కాలంలో పలువురు మంత్రులు.. మీడియా మిత్రుల ను పక్కకు పిలిచి.. కొంచెం సబ్జెక్టు ఉంటే చెబుతారా? అని ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నుంచి మంత్రులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉంది.
వైసీపీని టార్గెట్ చేయడం లేదని.. రాజకీయంగా బలమైన ఎదురు దాడి చేయడం లేదని మంత్రులను చంద్రబాబు వాయించేస్తున్నారు. పదే పదే ఆయన మంత్రులను హెచ్చరిస్తున్నారు కూడా. దీంతో మంత్రులు తరచుగా మీడియా ముందుకు వచ్చి జగన్ను, వైసీపీ నాయకులను విమర్శిస్తున్నారు.కానీ, ఆ విమర్శల్లో కొత్తదనం ఉండడం లేదు. తల్లిని చెల్లిని అన్యాయం చేశారని.. అక్రమాలు చేశారని.. గత పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని.. పదే పదే చెప్పిందే చెబుతున్నారు.
దీంతో ప్రభుత్వ అనుకూల మీడియా కూడా ఈ పాడిందే పాట అన్నట్టుగా ఉన్న విమర్శలకు పెద్దగా చోటు ఇవ్వడం లేదు. దీంతో మంత్రుల వ్యాఖ్యలకు ప్రాధాన్యం లేకుండా పోతోంది. ఈ క్రమంలో కొత్తగా వైసీపీని టార్గెట్ చేయడం ఎలా? అనే విషయంపై.. పెద్ద ఎత్తున వారు తల్లడిల్లుతున్నారు. పోనీ.. ఏదైనా అందామా? అంటే.. అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కేంద్రం నుంచి ఏమీ తేలేక పోయిందని.. ఇటీవల ఓ మహిళా మంత్రి అనేశారు. ఇవి హైలెట్ అయ్యాయి.
దీంతో బీజేపీ నాయకులు.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. విమర్శిస్తే.. జగన్ను మాత్రమే విమర్శించాలని.. కేంద్ర ప్రభుత్వం ఏంచేసిందని.. అప్పుడు ఉన్నది.. ఇప్పుడు ఉన్నది కూడా.. మోడీ సర్కారేనని.. అలా విమర్శలు చేయొద్దని గట్టిగానే తేల్చి చెప్పారు. దీంతో విమర్శించేందుకు కొత్త సబ్జెక్టు కావాలంటూ.. కొందరు మంత్రులు మీడియా వెంట పడుతున్నారు. ప్రస్తుతం సచివాలయ చాంబర్లలో ప్రధాన మీడియా కు చెందిన ప్రతినిధులు కనిపిస్తే.. ఇదే విషయంపై మంత్రులు, వారి పీఏలు కూడా.. అడ్గుగుతున్నారు. ఏదేమైనా.. రాజకీయాలు అంటే.. అంతే..!
Social Plugin