AMARAVATHI: ఏపీ ప్రభుత్వం అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతి పనుల రీ లాంఛ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోదీ అమరావతి పనులను ప్రారంభించారు. మూడేళ్ల కాలంలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అమరావతి కేంద్రంగా కొత్త సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అమరావతికి మరో కీర్తి కిరీటం గా మారబోతోంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది.
కీలక ఒప్పందం
అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు రంగం సిద్దం అవుతోంది. దేశంలోనే మొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కును అమరావతిలో నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పం దాలు జరిగాయి. ఐబీఎం సంస్థ 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్‌తో క్వాంటమ్ సిస్టం-2ని ఏపీలో నెలకొల్పుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీతో జరిగిన ఒప్పందం దేశానికే చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
దేశంలోనే తొలిసారి
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ , క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలను అందిపు చ్చుకోవడం ముఖ్యమని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని చంద్రబాబు వివరించారు. అందుకే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చి దిద్దాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థలకు సూచించానని తెలిపారు. దేశంలో క్వాంటమ్ ప్రయా ణానికి ఐబీఎం క్వాంటమ్ సిస్టం-2 ఏర్పాటు కీలక మలుపు కానుందని సీఎం అభిప్రాయపడ్డారు. తక్కువ సమయంలోనే క్వాంటమ్ వ్యాలీని నిర్మించాలన్నారు.
తొలి అడుగు
ఇప్పటికే ఎల్‌అండ్‌టీ సంస్థకు స్థలాన్ని కేటాయించామని చెప్పారు అందులో మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. నిర్మాణ పురోగతి, వ్యవస్థ అభివృద్ధి పర్యవేక్షణకు రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంతో టీసీఎస్ కలిసి పనిచేయడం వల్ల క్వాంటమ్ ఆల్గరిథం అభివృద్ధి వేగవంతం అవుతుందని ఐబీఎం క్వాంటమ్ ఉపాధ్యక్షుడు జే గాంబెట్టా అభిప్రాయపడ్డారు. క్వాంటమ్, క్లాసికల్ సిస్టమ్‌లను కలిపి హైబ్రిడ్ కంప్యూటింగ్ ద్వారా జీవశాస్త్రం, మెటీరియల్స్, క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని టీసీఎస్ సీటీఓ డాక్టర్ హారిక్ విన్ పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌తో విస్తృత ఉపయోగాలు ఉంటాయని ఐబీఎం ఉపాధ్యక్షుడు స్కాట్ క్రౌడర్ వెల్లడించారు. తాజాగా కుదిరిన ఒప్పందంతో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు తొలి అడుగు పడింది.
Social Plugin