Ticker

6/recent/ticker-posts

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాక్లెట్ బాయ్ !


ANDRAPRADESH, AMARAVATHI: మోడీ ఏమి మాట్లాడినా అలా వింటూ పరవశించిపోతారు. ఇది ప్రతీ వేదిక మీద కనిపించే సన్నివేశమే. జనసేన అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన బాధ్యతలతో ఉన్న వారు పవన్ కళ్యాణ్. అంతే కాదు ఆయన రీల్ లైఫ్ లో పవర్ స్టార్. ఆయన పేరు చెప్పగానే ఉర్రూతలూగే యువతరం కోట్లలో ఉంది పవన్ అన్న మూడు అక్షరాలు వారికి తారక మంత్రాలు. ఇక పవన్ కళ్యాణ్ లో గుర్తించతగిన విషయం పట్టుదల. 


ఆయన పంతం పట్టాలే కానీ ప్రత్యర్ధి రాజకీయ అంతం చూడక మానరు. అది 2024 ఎన్నికల్లో రుజువు అయింది. ఆయనకు ఏమి తెలుసు రాజకీయం అన్న వారు అంతా చతికిలపడి పోయారు. బ్యాక్ బెంచెస్ లోకి వెళ్ళిపోయారు. అటువంటి పవన్ కళ్యాణ్ ని చూస్తే మోడీకి పుత్ర వాత్సల్యం పొంగుకు వస్తుంది. ఆయన పవన్ ని ఆప్యాయంగా దగ్గరకు తీస్తారు. భుజం తడతారు. పవన్ రెండు చేతులనూ తీసుకుని ఆయనతో ఎంతో ప్రేమతో ముచ్చటిస్తారు. ఇలా పవన్ మోడీల బంధం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. పవన్ సైతం మోడీని చూడగానే గురు భావంతో తండ్రి పట్ల చూపించే గౌరవ భావంతో ఒదిగిపోతారు. 

మోడీ ఏమి మాట్లాడినా అలా వింటూ పరవశించిపోతారు. ఇది ప్రతీ వేదిక మీద కనిపించే సన్నివేశమే. ఇక అమరావతి రాజధాని పనుల పునర్ నిర్మాణానికి మోడీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పవన్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. పవన్ ప్రసంగం పూర్తి కాగానే తన సీటు వద్దకు వెళ్ళిపోతూంటే మోడీ ఆయనను పిలిచి మరీ చేతిలో చాక్లెట్ పెట్టారు. ఆ సన్నివేశం చూసిన వారు అంతా ఆసక్తిని ప్రదర్శించారు. 

మోడీ అయితే నవ్వుతూనే ఇదంతా చేశారు. పవన్ కూడా నవ్వుతూ తన సీటు వద్దకు వెళ్ళిపోయారు. ఇంతకీ పవన్ కి చాక్లెట్ ఎందుకు మోడీ ఇచ్చారు అన్న దాని మీద సోషల్ మీడియాలో మళ్ళీ ఎవరి కామెంట్స్ వారు చేస్తున్నారు. పవన్ రాజకీయంగా ఇంకా వర్ధమాన దశలో ఉన్నారని అందుకే ఆయనకు చాక్లెట్ మోడీ ఇచ్చారని కొంతమంది దురభిమానులు విమర్శలు చేస్తూంటే మరికొంతమంది తండ్రి హృదయం తో ప్రేమగా ఇచ్చారు అని అంటున్నారు. 

పవన్ తన ప్రసంగం చేస్తున్నపుడు దగ్గుతూ ఇబ్బంది పడ్డారు. దాంతో మోడీ ఆయన ప్రసంగం పూర్తి కాగానే చాక్లెట్ ఇచ్చి ఆయన ఇబ్బందికి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇదంతా తండ్రి ప్రేమతోనే చేశారు అని అంటున్నారు. ఏది ఏమైనా మోడీ పవన్ పట్ల చూపించిన ఈ ప్రేమకు ఎవరి వ్యాఖ్యానాలు వారు చేసుకున్నా ఈ ఇద్దరి అనుబంధం మాత్రం ప్రతీ మీటింగులోనూ ఒక ఆకర్షణగానే ఉంటోంది. 

మోడీ నిస్వార్ధ సేవకు ఆయన కుటుంబాన్ని కాదనికి దేశానికి అంకితమైన తీరుకు పవన్ ఎప్పటికీ ఆయనకు అభిమానిగా ఉంటూ వస్తున్నారు. ఇక పవన్ రీల్ లైఫ్ లో కోట్ల సంపాదనను సైతం పక్కన పెట్టి సమాజం కోసం దేశం కోసం పనిచేయడానికి ముందుకు వచ్చిన తీరు ఆయనలో పదవీ వ్యామోహం లేకపోవడం ఇవన్నీ కూదా మోడీకి నచ్చే గుణాలుగా చెబుతారు. మొత్తానికి వీరిద్దరి బంధం చాక్లెట్ అంత ఆకర్షణీయమైనది, తీయనిది అని అంటున్నారు అంతా.