ఒంగోలు సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొప్పోలు ప్లైఓవర్ సమీపంలో ముందు వెళ్తున్న కారుని లారీ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో చోట ట్రాక్టర్, కారు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో ప్రాంతంలో అదుపు తప్పి లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందారు.
ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనదారులు బాధ్యతాయుతంగా ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కాగా వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రకాశం జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Social Plugin