AMARAVATHI: దాని మీద నాడు అతి పెద్ద రచ్చ సాగింది. తోటి మంత్రిని మంత్రివర్గ సహచరుడు బాహాటంగా ఎలా నిందిస్తారు అని కూడా అన్నారు. కొద్ది నెలల క్రితం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కేబినెట్ లో ఒక మహిళా మంత్రి మీద చాలా తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. ఆమె నిర్వహిస్తున్న శాఖ మీద హాట్ కామెంట్స్ చేశారు. సరిగ్గా పనిచేయలేకపోతే ఆ శాఖని తాను తీసుకుంటాను అని కూడా హెచ్చరించారు.
ఇంతకీ ఎవరా మహిళా మంత్రి ఏమా కధ అంటే ఆమె హోం మంత్రి వంగలపూడి అనిత. ఆమె తన శాఖలో సరిగ్గా పనిచేయడం లేదని సహచర మంత్రిగా ఉంటూ పవన్ రిమార్క్ ఇచ్చారు. దాని మీద నాడు అతి పెద్ద రచ్చ సాగింది. తోటి మంత్రిని మంత్రివర్గ సహచరుడు బాహాటంగా ఎలా నిందిస్తారు అని కూడా అన్నారు. అంతే కాదు కేబినెట్ అంటేనే సమిష్టి బాధ్యత అని అలాంటపుడు ఆమె తప్పు చేశారు అంటే కేబినెట్ మొత్తానికి వరిస్తుంది కదా అని రాజ్యాంగ నిపుణులు లా పాయింట్లూ తీశారు. ఇక సదరు మహిళా మంత్రి మీద విమర్శలు చేయడాన్ని ఒక సామాజిక వర్గం సీరియస్ గా తీసుకుని పవన్ మీద తిరిగి విమర్శలు ఎక్కుపెట్టింది.
అదే మహిళా మంత్రి మీద పవన్ ప్రశంసలు కురిపించారు. ఎలా అంటే ఆమె సింహాచలంలో చందనోత్సవం వేళ జరిగిన పెను విషాద సమయంలో ఎంతో సహనంతో చాకచక్యంతో వ్యవహరించారు అని ఎక్స్ వేదికగా పవన్ ఆమెకి కితాబు ఇచ్చారు ఒక వైపు ఏడుగురు మరణించిన ఘోర విషాదం జరిగితే బాధితులందరితో ఆమె మాట్లాడి ఓదార్చి ప్రభుత్వం తరఫున అండగా ఉంటూ ఒక్కొక్కరికీ పాతిక లక్షల వంతున పరిహారం ఇప్పించారు. అలాగే మిగిలిన భక్తుల కోసం సాఫీగా చందనోత్సవం కార్యక్రమం జరిగేలా చూస్తూ ఎప్పటికపుడు అధికారులకు డైరెక్షన్ ఇస్తూ మొత్తం కార్యక్రమం అభాసు పాలు కాకుండా ఎంతో సమర్ధంగా వ్యవహరించారు. ఇవన్నీ చూసిన పవన్ కళ్యాణ్ అనిత ఈజ్ గ్రేట్ అనేశారు.
విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు ఎంతో బాధ్యతతో వ్యవహరించిన తీరు బాధితులకు అండగా ఉన్న విధానం గొప్పవని ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో ఉన్న వారు ఏ సమయంలో అయినా స్పందించాలని శోకంతో ఉన్న వారిని ఓదార్చాలని ఆ పని చేయడంతో అనిత నూరు శాతం విజయం సాధించారు అని ఆయన కొనియాడారు. మొత్తానికి అనిత నాడు తనను విమర్శించిన పవన్ తోనే నేడు కితాబు అందుకోవడం గ్రేట్ అని అంటున్నారు.
ఇక పవన్ విషయానికి వస్తే తప్పు ఉంటే నిర్భయంగా చెప్పడం సరిచేయడం అదే సమయంలో ఒప్పు ఉంటే ఎలాంటి భేషజం లేకుండా వారిని బాహాటంగానే పొగిడి ప్రోత్సహించడం ద్వారా పాత తరం రాజకీయ నాయకులను గుర్తుకు తెచ్చారని అంటున్నారు. ఏది ఏమైనా అనిత మాత్రం సింహాచలం దుర్ఘటన తరువాత పరిస్థితులను అదుపులోకి తీసుకుని రావడంలో అత్యంత సమర్ధంగా వ్యవహరించారు అని అంతా అంటున్నారు. లేకపోతే మొత్తం చందనోత్సవమే ఇబ్బందిగా మారి ఉండేదని కూడా అంటున్నారు.
Social Plugin