Ticker

6/recent/ticker-posts

జగన్ ఆఫర్ ఇస్తున్నా తీసుకునేవారు ఎంతమంది ?


ANDRAPARADESH: పార్టీని మీరే నడిపించడం స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోండి మీకు మంచి అనిపించింది చేయండి పార్టీ కోసం ఎంతైనా చేయండి అని చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మారిపోయారా అంటే అవును అని పార్టీలో వినిపిస్తోంది. ఎంతలా అంటే ఈ పార్టీకి మీరే యజమానులు అని స్టేట్మెంట్ ఇచ్చేటంత. అవును జగన్ అలాగే చెప్పారు. జిల్లా అధ్యక్షుల సమావేశంలో మీరే అసలైన ఓనర్లు అనేశారు. పార్టీ మీతోనే అన్నారు. మీరే సర్వస్వం అని కూడా అన్నారు. పార్టీని మీరే నడిపించడం స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోండి మీకు మంచి అనిపించింది చేయండి పార్టీ కోసం ఎంతైనా చేయండి అని చెప్పుకొచ్చారు. దీంతోనే వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నిజానికి వైసీపీలో కొంత మంది నాయకులకే మీడియాలో మాట్లాడే అవకాశం ఉంటుందని చెబుతారు. 

అంతే కాదు ఎవరేమి మాట్లాడినా పెద్దల నుంచి స్క్రిప్ట్ వస్తుంది అని అంటారు అలా ఎన్నో పరిధిలు పరిమితులు ఉంటాయి దాంతో చాలా మంది చేయాలని ఉన్నా చేయలేకపోతున్నారు. అంతే కాదు ఏమి చేస్తే ఏమొస్తుందో లేక ఏ ఉపద్రవం తోసుకుని వస్తుందో అని ఆలోచించేవారు. అయితే అలాంటిది ఏమీ పెట్టుకోవద్దు పార్టీ మీదే హాయిగా స్వేచ్చగా పనిచేసుకోండి అని జగం బంపర్ ఆఫర్ ని ప్రకటించారు. అంతే కాదు మీరే కీలక నిర్ణయాలు తీసుకోండి అన్నారు ఒక విధంగా వైసీపీ నేతలు ఎన్నడూ ఊహించని ఆఫర్ గానే దీనిని చూస్తున్నారు. 

ఇపుడు వారంతా తమకు నచ్చిన విధంగా వ్యవహరించవచ్చు. అంతే కాదు పార్టీ విషయాలు కానీ ప్రత్యర్ధి పార్టీ మీద విమర్శలు కానీ మీడియా ముందుకు వెళ్ళి చేయవచ్చు. ఇలా వారికి అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి. బాగా పనిచేస్తారు అని పిస్తే వారిని పార్టీలో కీలక పదవులలో తీసుకోవచ్చు అలాగే నియోజకవర్గం ఇంచార్జిల విషయంలో వారు సరిగ్గా పనిచేయలేకపోతే కనుక వారి విషయంలోనూ అధినాయకత్వానికి ఒక మాట చెప్పి తప్పించేయవచ్చు. కొత్త వారిని తాము సూచించి నియమించుకోవచ్చు. 

ఇలా చూస్తే కనుక వైసీపీలో అనేక రకాలుగా ఇపుడు లీడర్స్ కి పనిచేసే చాన్స్ వచ్చింది దేశంలో చూస్తే ఫ్రీగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆ చాన్స్ ఇస్తుంది అని చెబుతారు. మిగిలిన పార్టీలు అయితే అలా చేయలేవు. వాటికి ఒక విధానం ఉంటుంది. దాని ప్రకారమే ఎవరైనా కట్టుబడి ఉంటూ పనిచేయాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలలో అయితే అనేక రకాలైన రూల్స్ ఉంటాయి వాటి ప్రకారమే పనిచేయాలి. దాంతోనే చాలా మందికి తంటా వస్తుంది. మరి జగన్ ఏమి అనుకున్నారో ఏమి ఆశిస్తున్నారో తెలియదు కానీ పార్టీలో నాయకులకు స్వేచ్చ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని భావిస్తున్నారులా ఉంది. 

అందుకే ఓనర్ షిప్ మీదే అంటూ చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఒక విధంగా చూస్తే జిల్లాల అధ్యక్షులు సామంతరాజులు మాదిరిగా వ్యవహరించవచ్చు అన్న మాట. వారికి వారే ఆయా జిల్లాలలో కీలకం అన్న మాట. అయితే జగన్ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చినా ఎంతమంది దానిని సద్వినియోగం చేసుకుంటారు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఎందుకంటే ఇపుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది. దూకుడు ఎంత చేసినా ఉపయోగం అయితే తమకు పెద్దగా లేదని భావించేవారు సైలెంట్ గానే ఉండొచ్చు అని అంటున్నారు. 

అయితే జగన్ అన్నీ గమనిస్తారు అని పనిచేయని వారిని పక్కన పెడతారు అని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీలో చురుకైన నాయకత్వం తయారు అవుతుందని పనిచేసిన వారికి ఫ్యూచర్ లో పార్టీ అధికారంలోకి వస్తే మంచి అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మరి జగన్ ఇచ్చేశారు పుచ్చుకునేవారు ఎందరు అన్నదే చర్చగా ఉంది.