Ticker

6/recent/ticker-posts

మద్ది స్వామిని దర్శించు కున్న ఏఎస్పీ నక్కా సూర్య ప్రకాశరావు


జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: స్థానిక గుర్వాయిగూడెంలో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో మంగళవారం కావటం మూలంగా భక్తజనంతో కిటకిటలాడింది. తెల్లవారుఝామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు.  

అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైనరోజు కావడంతో పెద్ద సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు బారులుదీరి స్వామివారిని దర్శించుకొన్నారు. హనుమాన్ నామ స్మరణతో ఆలయం మారు మోగింది.108 ప్రదక్షణలతో మొక్కులు తీర్చుకున్నారు.

కాగా స్వామి వారిని జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ నక్కా సూర్యచంద్రరావు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామివారి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ మండపంవద్ద వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్ట్రాలు ప్రసాదాలు అందజేశారు. వారి వెంట లక్కవరం ఎస్ ఐ శశాంక, సిబ్బంది పాల్గొన్నారు. 

భక్తుల సౌకర్యార్ధం ఆలయమువద్ద గల మజ్జిగ చలివేంద్రంవద్ద పలువురు భక్తులు దాహార్తి తీర్చుకొన్నారు. మద్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు విరాళాల ద్వారా రూ 1,66,246/-లు సమకూరిననట్టు ఆలయ ఈ ఓ అసిస్టెంట్ కమీషనర్ ఆర్ వి చందన తెలిపారు. సుమారు 1500 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. దేవస్థానం పూజా కార్యక్రమాలు, భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. దేవస్థాన పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తగిన ఏర్పాట్లు చేశారు.