Ticker

6/recent/ticker-posts

గోకుల పారిజాతగిరిలో శ్రీనివాసునికి శ్రవణానక్షత్ర కళ్యాణోత్సవం


జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: ఇక్కడి ప్రసిద్ధ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం శ్రీ స్వామివారి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. 

కళ్యాణోత్సవంలో స్వామి భక్తులు శ్రీకాళహస్తి నిరంజన్ కుమార్ కుటుంబ సభ్యులు కొయ్యలగూడెం వాసి శ్రీనివాస్, దుర్గాదేవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పద్మావతి గోదా సమేత శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు కుమార్ ఆచార్యులు రాఘవాచార్యులు ఆధ్వర్యంలో జరిగింది. 

నూతన పట్టు వస్త్రాలు, యజ్ఞోపతం, మాంగల్య ధారణ, ముత్యాల తలంబ్రాలతోఈ కళ్యాణోత్సవం జరిపించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఉభయదారులకు శ్రీ స్వామివారి వేద ఆశీస్సులు సేవాస్త్రాలు ప్రసాదాలతో సన్మానించామని ఆలయ కార్యనిర్వాహణాధికారి మానికల రాంబాబు తెలియజేశారు.
 
స్వామివారి దర్శనానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచెర్ల జగపతి రాజు కుటుంబ సభ్యులు, చింతలపాటి వెంకటరామరాజు కుటుంబ సభ్యులు శ్రీ స్వామివారి అష్టదళ పాదపద్మ ఆరాధనలో పాల్గొన్నారు.