👉జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న అంబేద్కర జయంతి వేడుకలలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్....
👉పట్టణంలో ఉన్న పలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే....
👉కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలు...
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: నావంటి సామాన్యుడు సైతం అధికారహోదా కలిగిన రాజ్యాంగరీత్యా లభించిన పదవిని అనుభవిస్తున్నాము అంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయుడు పెట్టిన భిక్ష అని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సోమవారం పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కొత్త బస్టాండ్, ఎస్ సి పేట, బైపాస్ జంక్షన్ లలో జరిగిన అంబేద్కర్ జయంతిని నిర్వహించారు.
ముఖ్య అతిధిగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ వంటి మహానుభావులు ముందు చూపుతో తెచ్చిన రిజర్వేషన్లు ఈరోజు అన్ని వర్గాల వారికి మార్గదర్శకంగా మారాయని పేర్కొన్నారు. వారు చూపిన బాటలో ముందుకు వెళుతున్నా మని ప్రభుత్వం కూడా వారికి ఎనలేని గౌరవం
ఇస్తున్నదని తెలిపారు.
టీడీపీ నాయకులు పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజ్ పాల్, పరిమి సత్తి పండు, రావూరి కృష్ణ, పెనుమర్తి రామ్ కుమార్, కొండ్రేడ్డి కిషోర్, చిట్టీ బోయిన రామ లింగేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, సూర్య శ్రీనివాస్,
పరిమి ధర్మ రాజు, తదితరులుపాల్గొన్నారు.
చెరుకూరి సుందరం విగ్రహం ఆవిష్కరణ..
జంగారెడ్డిగూడెం: ఇక్కడి బుట్టాయిగూడెం రోడ్డు జంక్షన్ లో భగత్ సింగ్ యువజన సంఘం వ్యవస్తాపకుడు దివంగత చెరుకూరి సుందరం విగ్రహాన్ని ఎమ్మెల్యే రోషన్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సేవా సంఘం ద్వారా గుర్తింపు పొందిన చెరుకూరి సుందరం తెదేపా నేతగా పార్టీ పురోభి వృద్ధికి పాటు పడ్డారని కొనియాడారు. వారి కుమారుడు శ్రీధర్ చురుకైన నాయకుడని వారు ఏర్పాటు చేసిన విగ్రహం ఆవిష్కరణకు ఆహ్వానించిడం అభినందనీయం అన్నారు.
పెద్ద సంఖ్యలో తెదేపా నాయకులు సుందరం అభిమానులు, భగత్ సింగ్ యూత్ సభ్యులు, కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ నేతలు పరిమి సత్తి పండు, షేక్ ముస్తఫా, బొబ్బర రాజ్ పాల్ మాట్లాడారు.
Social Plugin