Ticker

6/recent/ticker-posts

ముత్యాలమ్మ ఆలయంలో భక్తులు పూజలు


ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: పట్టణంలోని ముత్యాలమ్మ ఆలయంలో శుక్రవారం పర్వదినం సందర్భంగా భక్తులకు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహానికి, అనంతశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. 

ఆలయ కమిటీ చైర్మన్ బవిరిశెట్టి మురళీ కృష్ణ, పద్మ కుమారి దంపతులుచే ఆలయ ప్రధానార్చకులు కె విజయ్ వినయ్ శర్మ పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి 22 రకాల హారతులు ఇచ్చారు. సూర్యచంద్ర, కుంభ, నక్షత్ర హారతులు ఇచ్చారు. 

అమ్మవారి దర్శించుకున్నవారిలో ఎర్ర నాగేశ్వరావు సత్య దంపతులు, చోడవరపు రంగా జ్యోతి, ఊటుకూరు నగేష్ రామబ్రహ్మం, పెయింట్ శ్రీను, పితాని సూర్యప్రకాష్ దంపతులు ముత్యాలమ్మ మంగ లావా దువ్వ రామకృష్ణ ఉన్నారు.