ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: పట్టణ ఇలవేల్పు నూకాలమ్మ అమ్మవారు ఆషాఢ అమావాస్య, శుక్రవారం పర్వదినం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పలువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కళ్యాణకళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీజలాలు వివిధ రకాల పండ్ల రసాలతో అర్చకులు అభిషేకం చేశారు.
మూల విరాట్ కు ఏకాదశ హారతి పూజలు, వేదదర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్ర పుష్పం సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు మనోజ్ శర్మ నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఈ సందర్భంగా భక్తుల నుద్దేశించి మాట్లాడుతూ అమ్మ వారి రజత వస్త్రం తయారీకి పిండి దుర్గ వారి కుమారులు సాయి శ్రీరామ్ చరణ్, భాను ప్రకాష్ లు సంయుక్తంగా 15 తులాల వెండి విరాళం ఇచ్చారని తెలిపారు.
అలాగే పసుపులేటి వెంకటేశ్వరావు, పద్మజ దంపతులు 5తులాల వెండి అందజేశారు. భీమవరం వాస్తవ్యులు వానపల్లి సూర్యనారాయణ, ధనలక్ష్మి దంపతులు 5తులాల వెండి సమర్పించారని వివరించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారని మేనేజర్ చిటికిన రాంబాబు తెలిపారు.
Social Plugin