Ticker

6/recent/ticker-posts

మద్ది క్షేత్రాన్ని దర్శించి ప్రత్యేక పూజలల్లో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్.


ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: పోలవరం ప్రాజెక్టును తమ పదవీకాలంలోనే పూర్తి చేస్తామని స్థానిక ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు జర్గనున్నాయని' ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి లెటర్ ఇవ్వబోతున్నామని ఎంపీ మహేష్ అన్నారు. జంగారెడ్డిగూడెం రూరల్ మండలంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఎంపీ మహేష్ సందర్శించి స్వామివార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆయనతో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్లమెంట్ లో జిల్లా కేంద్రం ఏలూరులో వందే భారత ట్రైన్ స్టాప్ ఓవర్ గురించి లెటర్ ఇస్తున్నానని, అలాగే చింతలపూడిలో ఆగిపోయిన రైల్వేలైన్ నిర్మాణం గురించి లెటర్ ఇవ్వబోతున్నానన్నారు. ఏలూరు పార్లమెంట్లో సమస్యల పరిష్కారానికి పనిలోకి దిగానని, ఇప్పటికే ఆర్ అండ్ బి, స్పోర్ట్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లతో మాట్లాడానని, స్టేడియంలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాల గురించి చర్చించడం జరిగిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులలో రైతులకున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ముందు అధ్వానంగా ఉన్న రోడ్లకు ప్యాచ్ వర్క్ నిర్వహించి అనంతరం పర్మినెంట్ రోడ్లు వేస్తామన్నారు.  

యువత కి ఉద్యోగ అవకాశాలు..
అలాగే యువత కు ఉద్యోగ అవకాశాలుకై ఈనెల 15న కొన్ని కంపెనీలతో సమీక్ష నిర్వహిస్తున్నానని ఎంపి తెలిపారు. వీలైనన్ని ఉద్యోగాలు యువతకు వచ్చేటట్లు కృషి చేస్తానన్నారు. ఏలూరులోని తన ఆఫీసులో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. తాను ఉన్నా లేకపోయినా గ్రీవెన్స్ లో చెబితే ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు పారేపల్లి రామారావు, టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.