జంగారెడ్డిగూడెం: మూడు దశాబ్దాల ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానం జులై 7 మాదిగ విద్యార్థుల చలో వరంగల్ కవాతు జయప్రదం చేయడం కోసం చీరాల వేదికగా విజయనగర్ కాలనీ నందు ఎమ్మార్పీ ఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల సన్నాహక సదస్సు ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్ర పోగు సురేష్ మాదిగ అధ్యక్షతన జరిగింది .ఈ జాతీయ కార్యవర్గ సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా మందకృష్ణ మాదిగ హాజరైయారు.
ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత విస్సంపల్లి సిద్దు మాదిగ, జంగారెడ్డిగూడెం పట్టణ ఎం ఆర్ పి ఎస్ అధ్యక్షులు బొడ్డపాటి పండు మాదిగ, ఎస్ ఆర్ సంస్థల అధినేత సింగంశెట్టి సత్తిరాజు, కొంచాడ సాగర్, మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై మాట్లాడారు. మీలాంటి నాయకుడితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆయన తోపాటు చుండూరు మృత వీరులకు నివాళులర్పించినారు. దళితులపై దాడులకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.
కాగా మందా కృష్ణ మాదిగ విజయనగర కాలనీలో 1991లో నివాసమున్న ఇంటిని సందర్శించి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. మూడు దశాబ్దాల ఎమ్మార్పీఎస్ ఉద్యమ విద్యార్థుల కవాతు జులై 7న జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్సార్ సంస్థల అధినేత సింగంశెట్టి సత్తిరాజు ఎమ్మార్పీఎస్ అధినేత మందా కృష్ణ మాదిగకు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు.
Social Plugin