ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం: పట్టణానికి ఉత్తరాన కోరికలుతీర్చి, భక్తుల పాలిటి కొంగుబంగారమై పట్టణ ఇలవేల్పుగా వేంచేసియున్న శ్రీ నూకాలమ్మ అమ్మ వారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీ నూకాలమ్మ అమ్మ వారి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీజలాలు మరియు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకాదశ హారతి పూజలు, వేదదర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహా మంత్ర పుష్పం మరియు సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నిర్వచహించారు.
ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ, అమ్మ వారి రజత వస్త్రం తయారీకి తిరుపతి త్రిపురసుందరి, రమేష్ దంపతులు 10బంగారు తులాల వెండి, జె.ధనలక్ష్మి బుట్టాయిగూడెం వాస్తవ్యులు 5తులాల వెండి మరియు సూరె భాస్కరరావు శ్రీమతి సత్యవతి దంపతులు రూ 10,116/ లు అమ్మ వారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ఆలయ అభివృద్ధికి విరాళంగా సమర్పించారు అని తెలిపారు.
శ్రీ నూకాలమ్మ అమ్మ వారి వెండి చీర తయారీలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని, అమ్మ వారి వస్త్రాలంకరణ, పుష్పాలంకారణ, ప్రసాద వితరణ మరియు ఆలయ అభివృద్ధికి సహకరించి అమ్మ వారి దివ్య అనుగ్రహము పొందగలరని, డాక్టర్ రాజాన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని భక్తులకు యే విధమైన ఇబ్బంది కలగకుండా చూచి ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారని మేనేజర్ సిహెచ్ రాంబాబు తెలిపారు.
Social Plugin