Ticker

6/recent/ticker-posts

ఆటా ఆధ్వర్యంలో వేడుకలు..: -కళా రత్న కెవి సత్యనారాయణ


ఏలూరు-ప్రతినిధి:
అమెరికా తెలుగు అసోసియేషన్ - ఆటా వేడుక లను ఎంతో ఘనంగా 2024 జూన్ 7, 8, 9 తారీకులలో అట్లాంటాలో జరగబోతున్నవి. ఈ కార్యక్రమానికి ఏలూరుకు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్య దర్శకులు కళారత్న కెవి సత్యనారాయణ అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా ఆహ్వానించడమైనది. ఈ ఉత్సవాలలో కళారత్న కెవి సత్యనారాయణ అట్లాంటాలోని నృత్య కళాకారులతో గోదా కళ్యాణం కూచిపూడి నృత్యరూపకాన్ని ప్రదర్శించబోతున్నారు. మే నెల మూడో వారం నుండి ఆగస్టు చివరి వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల పర్యటించబోతున్నారు. 

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కళారత్న కెవి సత్యనారాయణ 35 సంవత్సరాలుగా ప్రతి వేసవి సెలవులలో అక్కడి విద్యార్థినీ విద్యార్థులకు కూచిపూడి శిక్షణ తరగతులు నిర్వహించడమే కాకుండా మన తెలుగు సాహిత్యాన్ని ప్రతిబింబించే విధంగా కూచిపూడి నృత్య రూపకాలను అక్కడి కళాకారులతో ప్రదర్శించుచున్నారు. ఇప్పటికీ అమెరికా సంయుక్త రాష్ట్రాలను 35 సార్లు పర్యటించడమైంది. అక్కడ ప్రముఖ సంస్థలైన ఆట, తానా, నాటా, నాట్స్, బాటా, సిలికానాంధ్ర, టెన్ టెక్స్, డిటిఏ ఇంకా ఎన్నో ప్రముఖ తెలుగు సంస్థలలో మరియు అమెరికాలోని ప్రముఖ హిందూ దేవాలయాలలో ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో అవార్డులు, సన్మానాలు ప్రశంసలు పొందడం అయినది. 

ఈ సంవత్సరం ప్రత్యేకమైనది, కె వి సత్యనారాయణ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో శిక్షణ తరగతులు ప్రారంభించి 35 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా అక్కడే కొన్ని సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సారి టూర్ లో ఆస్టిన్, డల్లాస్, సాగిన, అట్లాంటా, న్యూ జెర్సీ, డెట్రాయిట్, డెనెవర్ మరి కొన్ని ప్రదేశాలలో కూచిపూడి శిక్షణ తరగతులు మరియు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. 

"ఇంతవరకు అమెరికాలో నా కార్యక్రమాలు విజయవంతవ్వటానికి సహకరించినటువంటి కళా సంస్థలకు, నా స్టూడెంట్స్ కు మిత్రులకు, ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు" అని కె వి సత్యనారాయణ చెప్పారు.