◆మీడియా తో మాట్లాడుతున్న నేతలు Eluru--; ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైసపినాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి ప్రాధాన్యత నిచ్చారని ఆపార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. 2019లోప్రకటించిన నవరత్నాల అమలులో భాగంగా నూటికినూరుశాతం పధకాలు అమలు చేసారని, 2024 ఎన్నికల మ్యానిఫెస్టో మరింత మెరుగ్గా ప్రకటించారని పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడి వైఎస్సార్సీపీ సీనియర్ నేత మేడవరపు విద్యా సాగర్ ఇంటి వద్ద నిర్వహించిన సమావేశానికి జంగారెడ్డిగూడెం టౌన్ వైసిపి అధ్యక్షుడు చిటికిన అచ్యుతరామయ్య అధ్యక్షత వహించగా పలువురు సీనియర్లు హాజరయ్యారు. అచ్యుత రామయ్య మాట్లాడుతూ 175 స్థానాలు తామే గెల్చుకుంటాం . అమ్మవడి, చేయూత మొదలగు పధకాలు అమలు చేస్తూ మాట తప్పని మడమతిప్పని నేతగ గుర్తింపుపొందారు. ఎన్నికల్లో 175స్థానాలు గెలిచి మళ్లి సిఎమ్ జగన్మోహన్ రెడ్డి ని గద్దె నెక్కిస్తామని చెప్పారు.
◆బైరెడ్డి పర్యటన విజయవంతం చెయ్యాలి.
వైఎస్సార్ సిపి రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సోమవారం జంగారెడ్డిగూడెంలో పర్యటన ఖరారైన నేపథ్యంలో భారీ ర్యాలీ రోడ్ షో నిర్వహించనున్నట్టు సీనియర్ నేతలు చిన్న, వైస్ చైర్మన్ ముప్పిడి అంజి రూరల్ అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు తెలిపారు. జిల్లా అధికార ప్రతినిధి జెడ్పిటిసి పొల్నాటి బాబ్జి మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చెయ్యాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో.. మేడవరపు విద్యాసాగర్, వైస్ ఎంపిపి తదితరులు పాల్గొన్నారు.
Social Plugin