ఏపీలో మూడు పార్టీలు కూటమి కట్టాయి. అందులో పెద్ద పార్టీ పెద్దన్న పార్టీ టీడీపీ. దానికి అధినాయకుడు చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయన స్వయంగా చెప్పుకున్నట్లుగా అనేక యుద్ధాలలో ఆరితేరిన యోధుడు. ఏకంగా తొమ్మిది ఎన్నికలను ఆయన నిర్వహించిన అపారమైన అనుభవం ఉన్నవారు. అంతమాత్రం చేత బాబు మీద పెను భారం పెట్టడం సమంజనం కాదు అని అంటున్నారు బాబు ఏడు పదుల వయసులో ఉన్నారు. మండుటెండల్లో ఆయన కష్టపడుతున్నారు. రోజుకు ఏకంగా మూడు సభలలో ఆయన పాల్గొంటున్నారు. ఆ మాటకు వస్తే గత నాలుగు నెలలుగా ఆయన కష్టపడుతున్నారు.
అగ్ర నేతల బాధ్యతలు కూటమిలో మరో పార్టీగా జనసేన ఉంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి పిఠాపురం నియోజకవర్గం చాలా కీలకంగా మారుతోంది. ఆ నియోజకవర్గంలో ఆయన గెలుపును పెను సవాల్ గా తీసుకుంటున్నారు. ఎంతలా అంటే ఆయన అక్కడ ఇల్లు కూడా తీసుకుంటున్నారు. ఉగాది వేడుకలు అక్కడే నిర్వహిస్తున్నారు. అక్కడ నుంచే రాష్ట్ర పర్యటనకు ఆయన షెడ్యూల్ రూపొందించుకుంటున్నారు. ఇక పిఠాపురం నుంచి ఉత్తరాంధ్రా జిల్లాల పర్యటనకు వెళ్లాలని ఆయన భావించినా జ్వరం కారణంగా ఆయన వెళ్ళడంలేదు. ఇప్పుడు కూడా రెండు రోజుల స్వల్ప కాలిక షెడ్యూల్ తోనే ఉత్తరాంధ్ర వెళ్తున్నారు. మరో వైపు చూస్తే బీజేపీ ఉంది. ఏపీలో ఆ పార్టీ బలం సంగతి ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో బాహు బలి లాంటి పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉంది. మరోసారి అధికారంలోకి రాబోతోంది అన్న అంచనాలు ఉన్నాయి.
అలాంటి బీజేపీ కూటమిలో కీలక భూమిక పోషిస్తుందని అంతా భావిస్తున్నారు కానీ బీజేపీ ఈ రోజుకీ ప్రచారంలో పెద్దగా పాలు పంచుకోవడం లేదు. ఆ పార్టీ జాతీయ నేతలు ఎవరూ ఏపీకి రావడంలేదు. దాంతో పాటు కూటమితో కలసి ఉమ్మడి సమావేశాలు ఏవీ రాష్ట్ర స్థాయిలో జరగడం లేదు. బీజేపీ ఎందుకో స్తబ్దుగా ఉంటోందని అంటున్నారు. ఆ పార్టీ ఇంకా అభ్యర్ధుల ఎంపిక దగ్గరే ఆగిపోతోంది. ఈ రోజుకీ కొన్ని చోట్ల క్యాండిడేట్లను మార్చమని ఒత్తిడి తెస్తోంది. ఆ విషయంలో అన్నీ సెట్ చేసుకుని కానీ రంగంలోకి బీజేపీ దిగేట్టుగా ఏమీ కనిపించడం లేదు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే బీజేపీ జాతీయ స్థాయిలో కీలక రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది. వాటి ప్రచారం మీదనే దృష్టి ఉంచింది. ఏపీలో నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పైగా కూటమి ఉంది చూసుకుంటుంది అని నెమ్మదిస్తోంది అని అంటున్నారు. సరిగ్గా ఇక్కడే తమ్ముళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏకంగా ఆరు ఎంపీ సీట్లు పది అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇచ్చింది దేని కోసం అని అంటున్నారు. ఏపీలో వైసీపీని ఎదుర్కోవడానికి బీజేపీ కూడా తోడు అయితే మూడు పార్టీలు కలసి ఉమ్మడిగా సభలు నిర్వహిస్తే కిక్ వస్తుందని జనంలో కూడా కొంత పాజిటివిటీ వస్తుందని అంటున్నారు. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు. బాబు ఒక్కతే కూటమి మొత్తం బాధ్యతలు మోస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో అయినా కూటమి ప్రచారాన్ని బీజేపీ జనసేన కలసి ఎలా ముందుకు తీసుకుని వెళ్తాయో.
Social Plugin