జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: మోటారు సైకిల్ పై ఎటువంటి ఆధారాలు లేని రూ. 2,36,500/-నగదు తీసుకు వెళుతుండగా స్థానిక మార్కండేయపురం వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం (ఎఫ్ ఎస్ టి) సీజ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తమ బృందం వాహన తనికీల్లో భాగంగా మార్కండేయపురం వద్ద విధులు నిర్వహిస్తున్న ప్లయింగ్ స్క్వాడ్ టీమ్ బుట్టాయి గూడెం వైపు వెళుతున్న మోటార్ సైకిలిస్టు తగరం అశోక్ చంద్ర వద్ద రూ2,36 500/- నగదు లభ్యం అయ్యిందని టీమ్ ఇంచార్జి కె విరమణ మీడియాకు తెలిపారు. ఇది పెట్రోల్ బంకు తాలూకా సొమ్మని అశోక్ చంద్ర చెప్పాడన్నారు. తగిన ఋజువులు లేవు కాబట్టి ఆర్ డి ఓ అద్దయ్య ఆదేశాల మేరకు సీజ్ చేసి ట్రెజరీ అకౌంట్ కు జమ చేసాం అన్నారు. ఎవరైనా రూ. 50 వేలు మించి నగదు వెంట తెచుకోవద్దని, ఒక వేళ తెచ్చుకుంటే తగిన ఆధారాలు చూపాలని రమణ తెలిపారు.
Social Plugin