Ticker

6/recent/ticker-posts

గోటితలంబ్రాలతో భద్రాద్రికి 23వ పాదయాత్ర ప్రారంభం


-జై శ్రీరాం నామంతో మారుమ్రోగిన పట్టణ ప్రధాన రహదారి
      
జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: శ్రీ సీతారామ కల్యాణానికై కోట్లాదిభక్తులకు భక్తితో 60 రోజుల ముందు నుండీ శ్రీరామ నామంతో ధాన్యం నుండి గోటితో ఒలిచి తయారు చేసుకున్న గోటి తలంబ్రాలు భద్రాద్రికి శ్రీరామనవమికి నాలుగు రోజుల ముందు మహా పాద యాత్రగా బయలుదేరి భద్రాద్రి చేరుస్తోంది జంగారెడ్డిగూడెంకు చెందిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి.

ఇప్పటికి 22 సంవత్సరాలు పూర్తిచేసుకుని శ్రీ క్రోధి నామ సంవత్సరంలో 23వ పాదయాత్ర శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి నిర్వహణలో శనివారం మొదలైంది. స్థానికి శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయం వద్ద సమితి అధ్యక్షులు ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలోయాత్ర ప్రారంభమయ్యింది. మహా పాద యాత్రను శ్రీరామ ధ్వజం ఊపి ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు(టెక్స్ మో) ప్రారంభించగా, శ్రీరామ రథానికి తపన ఫౌండేషన్ ప్రతినిధి, సినీ గేయరచయిత అనంత శ్రీరాం ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ సమర్పించారు. 

గోటితలంబ్రాల ప్రాశస్త్యం పాదయాత్ర విశిష్టతపై అధ్యాత్మికవేత్త కనుపర్తి ధనకుమార్ ప్రవచనం అందించారు. ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ 150 గ్రామాల నుండి మూడు జిల్లాలు, రెండు రాష్ట్రాల భక్తులు గోటితలంబ్రాలతో పాదయాత్రలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. 13వ తేదీన ప్రారంభమైన మహా పాద యాత్ర నాలుగు రోజుల అనంతరం 16వ తేదీ భద్రాద్రికి చేరుకుని 17న జరిగే శ్రీరామనవమి కళ్యాణానికి తలంబ్రాలు సభక్తి పూర్వకంగా సమర్పిస్తామని వివరించారు.

22 సంవత్సరాలు పూర్తయి 23వ ఏడాది మహా పాద యాత్ర ఈరోజు చేపట్టామని, సహకరిస్తున్న ప్రతినిధులకు, ఆతిధ్యం ఇస్తున్న దాతలకు, భక్తులకు సమితి నుండి ధన్యవాదాలు తెలిపారు. 22 ఏళ్ల గోటి తరం బ్రాల ప్రస్థానం అద్భుతమైనది.

--అనంత శ్రీరామ్

అనంత శ్రీరాం మాట్లాడుతూ 22 ఏళ్లుగా జరిగిన 23వ ఏట జరుగుతున్న యాత్ర దేశానికే స్ఫూర్తని, తపన ఫౌండేషన్ ద్వారా మొబైల్ ఉచిత వైద్య సేవలు అందించే వాహనం యాత్ర వెంట ఉంటుందని శ్రీరామ సేవా సమితి అడుగులో భాగస్వాములుగా నిలిచిన ప్రతీ ఒక్కరి జన్మధన్యమని అన్నారు. అనంతరం జై శ్రీరాం నామంతో పాదయాత్ర ప్రారంభమయ్యింది. జై శ్రీరాం నామంతో మారుమ్రోగిన పట్టణ ప్రధాన రహదారి మారుమ్రోగింది.

అశ్వారావుపేట రోడ్డులోని శ్రీవల్లీ దేవసేనా సహిత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ కమిటీ చక్రపొంగలి, ధద్యోజనం అల్పాహారంగా మరియు ప్యాకింగ్ తోనూ చోడు జావతో కలిపి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ భద్రాద్రి వైపుగా కదిలి వెళ్లే భక్తులకు సౌకర్యాలు పర్యవేక్షిస్తూ సాగుతున్నారు. నాలుగు రోజులు జరిగే మహా పాద యాత్రలో వేలాదిగా దారి పొడుగునా భక్తులు కలుస్తూ నడుస్తున్నారు.