Ticker

6/recent/ticker-posts

SIR ప్రక్రియను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి


పెదపాడు/ఏలూరు, జూన్ 22: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.


సోమవారం పెదపాడు మండలం వట్లూరులోని స్వర్ణ గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం, రెవిన్యూ సేవల అమలుపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి కుటుంబానికి అందించి, అవసరమైన వివరాలను సేకరించాలని అధికారులకు ఆదేశించారు.

ప్రజల నుంచి సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల్లోని సమాచారాన్ని సంబంధిత బీఎల్ఓలు (BLOలు) సకాలంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలాగే గ్రామంలో ప్రజలకు అందుతున్న రెవిన్యూ సేవలపై కూడా వివరాలు తెలుసుకుని, సేవల నాణ్యతను మెరుగుపర్చాలని సూచించారు.

ఈ తనిఖీలో తహసీల్దార్ కృష్ణజ్యోతి, ఎంపీడీఓ ఆమిల్ జమ్మద్ తదితర అధికారులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.