Ticker

6/recent/ticker-posts

నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీలో ఉద్యాన పంటలకు సరైన ధర నిర్ణయించాలి- జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ...


ఏలూరు, మే 13: జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ లోని నిర్వాసితులకు ఉద్యాన పంటల పంటలకు నిబంధనల మేరకు ధరలను నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.  స్థానిక  కలెక్టరేటు గౌతమీ సమావేశ హాలులో బుధవారం  నిర్వహించిన  జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. 


ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, రహదారి, తదితర ప్రోజెక్టుల నిమిత్తం భూసేకరణ చేసిన రైతులకు ఉద్యానవన పంటల పరిహారం నిబంధనల మేరకు చెల్లింపులు చేయాలన్నారు.  నిబంధనలతో లేని డ్రాగన్ ఫ్రూట్ వంటి కొన్ని ఉద్యానవన పంటలకు అందించాల్సిన పరిహారాన్ని జిల్లా స్థాయి కమిటీలో సభ్యులతో చర్చించి న్యాయమైన రేట్లను నిర్ణయించాలని,  రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.  

బుట్టాయిగూడెం మండలం బుట్టాయిగూడెం  రైతు నుండి 3.46 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగిందని, సదరు భూమిలో రైతు డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారని,    ప్రభుత్వ నిర్దేశించిన జీవోలో డ్రాగన్ ఫ్రూట్ పంటకు పరిహారం అంశం  లేనందున జిల్లా స్థాయి కమిటీ పూర్తి అధ్యయనం చేసి రైతులకు నష్టం జరగకుండా రేటును నిర్ణయించాలని అన్నారు.  డ్రాగన్ ఫ్రూట్ సాగు ఉన్న అనంతపురం, ప్రకాశం, పల్నాడు జిల్లలలో అక్కడ ఉన్నతాధికారులతో సంప్రతించి  రేటును నిర్ణయించాలని ఆదేశించారు. 

భూ సేకరణ ప్రక్రియలో రైతులకు ఉన్న పంటలకు న్యాయమైన పరిహారం అందించే దిశగా అధికార్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన జీవో ప్రకారం వివిధ పంటలకు అమలులో ఉన్న రేట్లను అనుసరించాలని, లేని పంటలకు జిల్లా స్థాయీ సంఘంచే రైతులకు సంతృప్తి చెందేలా రేట్లను నిర్ధారించి నష్టపరిహారాన్ని అందించాలని అన్నారు.  జిల్లా స్థాయీ సంఘం సమావేశమై సంబంధిత పంటలు సాగు వ్యయం, దిగుబడి, మార్కెట్ ధరలు మరియు రైతులకు కలిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన రేట్లు నిర్ణయించాలని ఆదేశించారు. 
భూ సేకరణ ప్రక్రియ పారదర్శకంగా, రైతులకు అనుకూలంగా నిర్వహించబడాలని అధికారులకు సూచించారు. రైతులు అభ్యంతరాలు, సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బుట్టాయిగూడెం మండలం బుట్టాయిగూడెం భూ సేకరణలో ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసి  బుట్టాయిగూడెం మండలం కుడలిపాడు, కూనవరం గ్రామ ప్రజలకు గృహాలను అప్పజెప్పాలని అన్నారు.

ఈ సమావేశంలో భూసేకరణల స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ శాఖ జెడి యస్.కె.హబీబ్ భాషా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజానాయక్, జిల్లా పట్టు పరిశ్రమలు శాఖ అధికారి ఐ.శ్రీనివాసు,వెంకటరామన్నగూడెం శాస్త్రవేత్త డా.సుశీల, బుట్టాయి గూడెం మండలం ఉద్యానవన శాఖ అధికారి యన్.ప్రసన్నలక్ష్మి, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.