Ticker

6/recent/ticker-posts

లోకేష్ పట్టాభిషేకానికి ముహుర్తం ఫిక్స్-చంద్రబాబు కీలక ఆదేశాలు..!


ANDRAPRADESH: ఏపీలో కూటమి సర్కార్ ను నడుపుతున్న టీడీపీలో కీలక మార్పుకు రంగం సిద్దమవుతోంది. సీఎం చంద్రబాబు వయస్సు రీత్యా పార్టీని నడిపేందుకు సమర్ధుడిగా భావిస్తున్న ఆయన తనయుడు నారా లోకేష్ (Nara Lokesh)కు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్టీ కమిటీల ఏర్పాటులో భాగంగా లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేశారు. ఇప్పుడు ఆయన పగ్గాల స్వీకరణకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 29న కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు.


ప్రజలకు సంక్షేమం, ప్రభుత్వ సేవలు, రాష్ట్రాభివృద్ధి విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని...కానీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు. ృవాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూనే ప్రజలకు సంక్షేమం-అభివృద్ధి అందించే విషయంలో రాజీ పడకుండా పరిపాలన సాగిస్తున్నామన్నారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని వారికి సూచించారు. మహానాడు నిర్వహణకు సంబంధించిన కమిటీల ఏర్పాటుపైనా కసరత్తు చేస్తున్నట్టు సీఎంకు పార్టీ నేతలు వివరించారు.

కొందరు ప్రభుత్వం మీద.. కూటమి పార్టీల మీద అబద్దాలాడుతూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వివిధ మార్గాల ద్వారా.. వివిధ వ్యక్తుల ద్వారా చేరవేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే... వాళ్లే విశ్లేషించుకుంటారన్నారు. 

పరిపాలన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగితే... ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టేలా ప్రజలే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారతారని చెప్పారు. టీడీపీ నిర్వహిస్తోన్న ట్రైనింగ్ క్లాసులతో పాటు, కాఫీ కబుర్లు వంటి కార్యక్రమాల ద్వారా లీడర్-కేడర్ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతోందని తెలిపారు.