Ticker

6/recent/ticker-posts

ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్‌ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!


ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని కంచికచర్ల మండలం కీసర టోల్‌ ప్లాజా వద్ద ఘోర సంఘటన చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక సిమెంట్ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఖరీదైన బీఎండబ్ల్యూ (BMW) కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.


ఘటన జరిగిన వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. కారుపై పడిన భారీ ట్యాంకర్‌ను తొలగించేందుకు క్రేన్లను రప్పిస్తున్నారు. కారు లోపల ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అయితే, లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ భారీ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కీసర టోల్‌గేట్ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తూ వాహనాలను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.