Ticker

6/recent/ticker-posts

ప్రతీ వర్షపు చుక్కని ఒడిసి పట్టాలి - నీటి వనరులన్నీ నిండుజలాలతో కళకళలాడాలి: జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి


ఏలూరు/ ఉంగుటూరు, ఏప్రిల్, 8: జిల్లాలో కురిసిన ప్రతీ వర్షపు చుక్కని ఒడిసిపట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.  'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమం అమలులో భాగంగా భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలోని ఎర్ర చెరువును బుధవారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో నీటి సంరక్షణ పనులు చేపట్టి, భూగర్భజల మట్టాలను పెంచడం, ప్రతీ వర్షపు చుక్కని ఒడిసి పట్టి, నీటి వనరులన్నీ నిండుజలాలతో కళకళలాడేలా చేయడమే 'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. 


జిల్లాలో గ్రామ, మండలాల వారీగా ఉన్న చెరువులు, కాలువలు, ఫీడర్ చానెల్స్ లను గుర్తించి వాటికి నీటి ప్రవాహం, నీటి నిల్వ సామర్ధ్యాన్ని గుర్తించి నీటి ప్రవాహానికి తూడు, గుర్రపుడెక్క వంటిని అడ్డంకులు తొలగించడానికి, చెరువులలో నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచేందుకు పూడికతీత, పునర్నిర్మాణం, ఆక్రమణల తొలగింపు  తదితర  పనులపై వెంటనే ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. . 

పనుల గుర్తింపులో సాగునీటి వినియోగదారు సంఘాల ఛైర్మెన్ లు సభ్యుల సూచనలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.    ప్రతిపాదనలు అందిన వెంటనే పరిపాలనా ఆమోదం మంజూరు చేయడం జరుగుతుందని, వెంటనే పనులు ప్రారంభించి నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  ఉద్యానవన పంటల రైతులు  తమ క్షేత్రంలో తప్పనిసరిగా ఫామ్ పాండ్స్ ఏర్పాటుచేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇరిగేషన్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్ దేవప్రకాష్, తహసీల్దార్ రమాదేవి, రెవిన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, తదితర  శాఖల అధికారులు పాల్గొన్నారు.