ఏలూరు, ఏప్రిల్, 8 : ఎల్నినో ప్రభావంతో పంటల దిగుబడులు తగ్గకుండా ఉండేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా చెప్పారు. ఐఏడీపీ హాల్లో బుధవారం ప్రకృతి వ్యవసాయ అమలుపై 3వ రోజున 154 మంది కేడర్కు విస్తృత స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. .
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్కే అబ్బెబ్ బాషా మరియు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి. వెంకటేష్ ఎల్నినో ప్రభావంతో పంటల దిగుబడులు తగ్గకుండా ఉండేందుకు రైతులకు అవగాహన కల్పిస్తూ ఇది పసిఫిక్ మహాసముద్రంలో సముద్రపు నీటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడి భారతదేశంలో వర్షపాతం తగ్గించి ఎండలు పెరగడానికి కారణమవుతుందని వివరించారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా డ్రౌట్ ప్రూఫింగ్ మోడల్, హాఫ్ మూన్ మోడల్ వంటి పద్ధతులు అమలు చేయడంతో పాటు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని, ప్రతి రైతుకు నవధాన్యాలు విత్తన కిట్లు అందించి అవగాహన పెంచాలని తెలిపారు.
నవధాన్యాలు ద్వారా సంవత్సరం పొడవునా పచ్చదనం నిలిచి కలుపు నియంత్రణ, నేలలో కార్బన్ శాతం పెరుగుదల, పురుగులు మరియు వ్యాధుల నియంత్రణ, సూక్ష్మజీవుల చురుకుదనం, నీటి నిల్వ సామర్థ్యం మెరుగుదల వంటి ప్రయోజనాలు లభిస్తాయని వివరించారు. అదనంగా నవధాన్యాల పంటలు పశువులకు పోషకమైన పచ్చిమేతగా ఉపయోగపడటంతో పాటు వానపాముల సంఖ్య పెరిగి నేల సారవంతం అవుతుందని, రసాయనాల వినియోగం తగ్గుతుందని తెలిపారు.
ప్రస్తుతం రసాయన మరియు ప్రకృతి వ్యవసాయం రెండింటినీ అనుసరిస్తున్న రైతులను పూర్తిగా సీడ్ టు సీడ్ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని తెలిపారు, కేడర్ icrp లా ను సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకొని వ్యవసాయ కార్యకలాపాల పర్యవేక్షణలో ఊర్వి యాప్ ను సమర్థంగా వినియోగించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండే ఆహారం రసాయన అవశేషాలు లేకుండా ఆరోగ్యకరంగా ఉండటంతో పాటు జీవ వైవిధ్యం పెరిగి పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇది కాలానుగుణ అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రకృతి వ్యవసాయ కేడర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

