Ticker

6/recent/ticker-posts

అర్ధ నగ్న ఫొటోలతో రచ్చ రచ్చ.. విష్ణు ప్రియపై క్రిమినల్ కేసు


ప్రముఖ టెలివిజన్ యాంకర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ విష్ణుప్రియ భీమినేని చుట్టూ తాజాగా వివాదం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ఆమె అసభ్యతను ప్రోత్సహిస్తున్నారంటూ విద్యార్థి సంఘం నాయకులు పోలీసులను ఆశ్రయించారు. నమస్తే తెలంగాణ కథనం ప్రకారం.. శనివారం విజయవాడలోని సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై అధికారికంగా ఫిర్యాదు నమోదైంది.

ఏఐఎస్‌ఎఫ్ (AISF) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక ఆరోపణలు చేసింది. విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అర్ధనగ్న వీడియోలను ప్రదర్శిస్తున్నారని, వాటిని వీక్షించాలంటే ప్రత్యేకంగా సభ్యత్వ రుసుము (Subscription Fee) చెల్లించాలని ప్రచారం చేస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు.

సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తులు ఇలాంటి పనులకు పాల్పడటం వల్ల యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా సమాజంలో నైతిక విలువలను దిగజార్చేలా వ్యవహరించడం సరికాదని వారు విమర్శించారు. ఈ వ్యవహారంలో పోలీసులు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్ నేతలు రెండు ప్రధాన డిమాండ్లను ముందుకు తెచ్చారు. 

విష్ణుప్రియకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను వెంటనే నిలిపివేయాలి, ఐటీ చట్టం (IT Act) కింద ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, ప్రాథమిక విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.