Ticker

6/recent/ticker-posts

వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య


ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా చంద్రగిరి: మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురైన 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. అరిగెలవారిపల్లెకు చెందిన షాలిని.. పనపాకం హరిజనవాడకు చెందిన ఎస్.చందును ఎనిమిదో తరగతి నుంచి ప్రేమించినట్లు తెలుస్తోంది. 


విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు షాలినిని బెంగళూరుకు పంపించినా.. చందు అక్కడికీ వెళ్లి ఆమెను కలుస్తూ వచ్చాడని సమాచారం. గతంలో షాలిని మైనర్‌గా ఉన్న సమయంలో ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. చందు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ పెళ్లిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే చందుకు వారంలో మరో యువతితో వివాహం నిశ్చయం కావడంతో షాలిని తీవ్ర మనస్తాపానికి గురైంది. 

మంగళవారం బెంగళూరులోని నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు చివరిగా ప్రియుడికే ఫోన్‌ చేసినట్లు సమాచారం. ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం షాలిని మృతదేహాన్ని స్వగ్రామం అరిగెలవారిపల్లెకు తరలించారు.