Ticker

6/recent/ticker-posts

అంబేద్కర్ జయంతి సందర్భంగా వృద్ధులకు చీరల పంపిణీ


ఏలూరు, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏలూరు 44వ డివిజన్ గన్‌బజార్‌లో కార్పోరేటర్ పొలిమేర దాసు ఆధ్వర్యంలో వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు హాజరై, ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతి పవిత్రమైన రోజు అని పేర్కొంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్పోరేటర్ పొలిమేర దాసును అభినందించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశానికి మార్గదర్శిగా నిలిచి సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలను ప్రజలలో నెలకొల్పిందని పేర్కొన్నారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్య, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు.