Ticker

6/recent/ticker-posts

APSRTC Bus ప్రయాణికులకు శుభవార్త


ఆంధ్రప్రదేశ్: ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీలను తాజాగా అధికారులు సవరించారు. నిన్నటి వరకు ఏపీలో తిరుగుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల కన్నా అధికంగా ఛార్జీలు వసూలు చేసేవారు. ఏపీలో సర్వీసులు అందించే టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) బస్సుల్లో దూరాన్ని బట్టి రూ.20 నుండి రూ.130 వరకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. 


దీనిపై ప్రయాణికులు ఎంతో కాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల బస్సుల్లో సమాన ఛార్జీలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులతో సమానంగా టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను కూడా తాజాగా సవరించారు. ఆర్టీసీ ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు.

తెలంగాణ ఆర్టీసీకి చెందిన వేలాది బస్సులు ప్రతిరోజూ ఏపీలో సర్వీసులు అందిస్తున్నాయి. అయితే వీటిలో ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ ఆర్టీసీ అధికారులు, ఏపీ ఆర్టీసీ బస్సులతో సమానంగా తెలంగాణ బస్సుల్లో ఛార్జీలు ఉండేలా టారిఫ్‌ల్లో సవరణలు చేశారు. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో పాటు ఏపీ ఆర్టీసీ ఉన్నతాధికారులు మరో కీలక ప్రకటన చేశారు. ఉచిత ప్రయాణం అమల్లో ఉన్న బస్సుల్లో.. దివ్యాంగులు, వృద్ధులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వాలని, వాటిల్లో ఇతరులు కూర్చోవద్దని తెలిపారు. వారికి కేటాయించిన ప్రత్యేక సీట్లలో వారు మాత్రమే కూర్చునేలా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.