ANDRAPRADESH/TELANGAN: డిజిటల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏది క్లిక్ అవుతుందో చెప్పడం కష్టం. ఒక్కోసారి విమర్శలే వ్యక్తిగత ప్రచారానికి పెట్టుబడిగా మారుతుంటాయి. ప్రస్తుతం బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని విషయంలో ఇదే జరుగుతోంది. అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారంటూ ఆమెపై నమోదైన కేసు, నైతికంగా ఆమెకు ఇబ్బంది కలిగించినా, ఆర్థికంగా మాత్రం ఊహించని లాభాలను తెచ్చిపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
విష్ణుప్రియ తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యేక కంటెంట్ కోసం రూ.399 సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై విజయవాడలో AISF (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయకముందు వరకు ఆమె సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరిమితంగానే ఉండేది. కేసు నమోదుకు ముందు ఆమె సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1,892. ఈ లెక్కన ఆమె నెలవారీ ఆదాయం దాదాపు ₹7,18,960 ఉండేది. కేసు నమోదు తర్వాత ఎప్పుడైతే మీడియాలో ఈ కేసు గురించి, ఆమె అప్‌లోడ్ చేస్తున్న కంటెంట్ గురించి రచ్చ మొదలైందో నెటిజన్లలో క్యూరియాసిటీ ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా ఆమె సబ్‌స్క్రైబర్ల సంఖ్య 4,832 కి చేరింది. దీని ద్వారా ఆమె ప్రస్తుత ఆదాయం అక్షరాలా ₹18,36,160 కు చేరుకుంది. కేవలం ఒక్క వివాదం వల్ల ఆమె నెలవారీ సంపాదనలో ఏకంగా ₹11 లక్షలకు పైగా భారీ పెరుగుదల కనిపించడం డిజిటల్ పబ్లిసిటీ పవర్‌ను చాటిచెబుతోంది.
విష్ణుప్రియ డబ్బుల కోసం కక్కుర్తి పడి యువతను తప్పుదోవ పట్టించేలా అర్ధనగ్న వీడియోలు పోస్ట్ చేస్తున్నారని, ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను వెంటనే బ్లాక్ చేయాలని వారు డిమాండ్ శనివారం విజయవాడ సూర్యారావుపేటలోని సైబర్ క్రైమ్ పోలీసులకు AISF రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలుగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, ఇలాంటి అశ్లీల ప్రచారాలు చేయడం సరికాదని వారు విమర్శించారు. నైతిక విలువలను కాపాడాలనే ఉద్దేశంతో AISF నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ, పరోక్షంగా అది విష్ణుప్రియకు ఫ్రీ పబ్లిసిటీగా మారింది. ఒక కంటెంట్‌ను ఎంతగా అడ్డుకోవాలని చూస్తే, దాన్ని చూడాలనే ఆసక్తి ప్రజల్లో అంతగా పెరుగుతుందనే స్ట్రీసాండ్ ఎఫెక్ట్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. టీఆర్పీల కోసం మీడియా సంస్థలు చేసిన హడావుడి కొత్త కస్టమర్లను ఆమె ప్లాట్‌ఫారమ్ వైపు మళ్లించింది.
ఆర్థికంగా విష్ణుప్రియ లాభపడినప్పటికీ, ఈ పరిణామాలు సమాజంలోని నైతిక విలువలపై దెబ్బతీస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. తప్పు చేస్తే శిక్ష పడుతుందో లేదో కానీ పబ్లిసిటీ మాత్రం వస్తుంది అనే సంకేతం యువతలోకి వెళ్లడం ఆందోళనకరం. యాంకర్‌గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ ఈ విమర్శలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. పోలీసులు ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

