జెరూసలేం: ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం టార్గెట్‌గా ఇరాన్ భీకర క్షిపణి దాడులు చేసింది. దీంతో, ఇజ్రాయెల్‌కు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇక, ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం సమీపంలోని డిమోనా, అరద్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. అయితే, డిమోనా ప్రాంతంలో ఇజ్రాయెల్‌కు కీలకమైన అణు కేంద్రం ఉండటం వల్ల భద్రతా ఆందోళనలు పెరిగాయి. ఇక, ఈ ఘటనలో పిల్లలు సహా 100మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ స్పందించింది. ఇరాన్ క్షిపణులు నేరుగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయని పేర్కొంది. దీని వల్ల అరుద్, డిమోనా ప్రాంతాలు ధ్వంసమయ్యాయని, 100 మందికిపైగా గాయపడ్డారని తెలిపింది. దీనిని ఉగ్రవాద చర్య, యుద్ధ నేరంగా అభివర్ణించింది.
MAJOR IRANIAN ATTACK..
— Earth Hippy 🌎🕊️💚 (@hippyygoat) March 21, 2026
Israel’s most secretive nuclear site
In Dimona is on fire‼️
Widely believed to be a nuclear research and weapons-related facility. pic.twitter.com/t6MSGsSAR2

