Ticker

6/recent/ticker-posts

భీమడోలు రైతు సేవా సహకార సంఘం బోర్డు సమావేశం


భీమడోలు: రైతు సేవా సహకార సంఘంలో ఆప్కాబ్ చైర్మన్ మరియు సంఘ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి త్రిసభ్య కమిటీ సభ్యులు గేదెల శ్రీనివాసరావు, వెజ్జు రాంబాబు మరియు సొసైటీ సీఈఓ నాగేంద్ర హాజరయ్యారు.

ఆర్థిక లావాదేవీల ఆమోదం

గత రెండు నెలలుగా ఫిబ్రవరి 28 వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఖర్చులను బోర్డు ఆమోదించింది.

మహాజన సభ నిర్ణయం

త్వరలో భీమడోలు రైతు సేవా సహకార సంఘ మహాజన సభ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యోగుల ఇన్సూరెన్స్ పాలసీ

ఉద్యోగుల ఇన్సూరెన్స్ పాలసీ కింద ఉద్యోగులు చెల్లించవలసిన వాటాను వారికి భారం కాకుండా సహకార సంఘం తరఫున భరించేందుకు తీర్మానించారు.

రుణాల చెల్లింపులు – ఆర్థిక పరిస్థితి

ధాన్యం కొనుగోలు ద్వారా వచ్చిన రూ.3.28 కోట్ల ఆదాయాన్ని డీసీసీబీ రుణ ఖాతాకు బదిలీ చేయడం ద్వారా బ్యాంకు ఇన్‌బ్యాలెన్స్‌ను రూ.3.16 కోట్లకు తగ్గించారు.

డిపాజిట్లు – రుణాల పంపిణీ

నూతన బోర్డు ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు రూ.80 లక్షలు డిపాజిట్ల రూపంలో సేకరించారు. అదనంగా రూ.4 కోట్ల రుణాలను రైతులకు అందజేసినట్లు తెలిపారు.

అభివృద్ధి సూచనలు

సమావేశం అనంతరం సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై బ్యాంకు అభివృద్ధికి మరింత కృషి చేయాలని, లోన్ రికవరీ శాతం పెంచాలని అధ్యక్షులు సూచించారు.