Ticker

6/recent/ticker-posts

పెదపాడు శాఖా గ్రంథాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం


పెదపాడు, మార్చి 08: పెదపాడు గ్రామంలోని శాఖా గ్రంథాలయంలో 08న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో స్థానిక ఎంపీపీ స్కూల్ టీచర్ వేమిరెడ్డి వెంకట్ లక్ష్మి, గ్రంథాలయ సిబ్బంది ఘంటా వేణు లకు శాలువాలు, పూలదండలు, ఫలాలతో సత్కారం చేసి గౌరవించారు.


ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న మహిళలకు అభినందనలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతూ ముందుకు దూసుకుపోతున్నారని, వారి శక్తి, సహనం, అనురాగం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు నివాసం ఉంటారని కొనియాడారు. అలాగే సమాజంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, మహిళలకు ఉన్న చట్టపరమైన హక్కులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పెదపాడు గ్రామ పెద్దలు మరియు గ్రంథాలయ పాఠకులు బి. ప్రభాకర్ రాజు, ఎం. పవన్ కృష్ణ, కాకరాల సత్యనారాయణ, గారపాటి నాని, అక్కినేని రామకృష్ణ (బాబి), పిట్టా బ్లెస్స్లీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.