Ticker

6/recent/ticker-posts

బర్రింకలపాడులో శ్రీ కోదండ రామాలయం పునఃనిర్మాణానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శ్రీకారం


జీలుగుమిల్లి, మార్చి 08: జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలోని పురాతన శ్రీ కోదండ రామాలయం పునఃనిర్మాణ పనులకు ఆదివారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


పునఃనిర్మాణ పనులు ప్రారంభించే ముందు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పాత ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహాలను భక్తి శ్రద్ధలతో పక్కనే ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆలయంలో ప్రతిష్టించారు. అనంతరం ఆలయ పునఃనిర్మాణ కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ గ్రామంలోని ఈ పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో పునఃనిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఆలయ నిర్మాణ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చిర్రి కృష్ణయ్య, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, చిర్రి రాంపండు తదితరులు, గ్రామస్తులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.