చింతలపూడి, మార్చి 12: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు కావూరి సాంబశివరావు స్వర్గస్తులైన సందర్భంగా చింతలపూడి పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు.
చింతలపూడి టౌన్‌లోని బోసు బొమ్మ సెంటర్ వద్ద టౌన్ మరియు రూరల్ బీజేపీ నాయకులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన దేశ రాజకీయాల్లో చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో చింతలపూడి టౌన్ అధ్యక్షురాలు కొత్తపల్లి విజయకుమారి, రూరల్ అధ్యక్షుడు తాటిపర్తి శ్రీనివాసరావు, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు తోట వెంకటనారాయణ, ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ సిరంగు ప్రసాద్, జిల్లా స్వచ్ఛ భారత్ కో-కన్వీనర్ దూదిగం వెంకట రామ్మోహన్ రావు పాల్గొన్నారు.
అలాగే టౌన్ ప్రధాన కార్యదర్శి బర్మా శశి, రూరల్ ప్రధాన కార్యదర్శి సోహన్ భార్గవ్ సింగ్, తిమ్మిరెడ్డిపల్లి శ్యామ్ శేఖర్, ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, సరిపూడి దుర్గాప్రసాద్, సెక్రటరీ ఉదయభాస్కర్, రూరల్ ఉపాధ్యక్షులు సాంబశివరావు, మధుసూదన్ రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా సెక్రటరీ రత్నరాజు, రాంబాబు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కావూరి సాంబశివరావు గారికి ఘనంగా నివాళులు అర్పించారు.



.jpeg)