ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.29 కోట్లతో 110 సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు లేఖ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, దెందులూరు నియోజకవర్గంలో పలు రోడ్లు అధ్వాన స్థితిలో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అత్యవసరంగా రోడ్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ను కోరారు.
ప్రతిపాదించిన పనుల వివరాలు ఇలా ఉన్నాయి:
-
దెందులూరు మండలం: రూ.5.96 కోట్లతో 27 సీసీ రోడ్లు
-
ఏలూరు రూరల్ మండలం (నియోజకవర్గ పరిధిలో): రూ.3.09 కోట్లతో 11 రోడ్లు
-
పెదపాడు మండలం: రూ.4.69 కోట్లతో 14 రోడ్లు
-
పెదవేగి మండలం: రూ.15.27 కోట్లతో 58 రోడ్లు
మొత్తం రూ.29 కోట్ల అంచనా వ్యయంతో 110 రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే అభ్యర్థించారు.
ఎమ్మెల్యే ప్రతిపాదించిన పనులను పరిశీలించి నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి డ్వామా పీడీ సుబ్బారావుకు ఆదేశాలు జారీ చేశారు.


.jpeg)
