ఏలూరు, ఫిబ్రవరి 28: పెన్షన్‌దారుల కళ్లల్లో ఆనందాలు వెల్లివిరియాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తెలిపారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఇందులో భాగంగా శనివారపుపేట హైస్కూల్ రోడ్డులో జరిగిన కార్యక్రమానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ సొమ్ములు పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ పెన్షన్‌దారులు తమకు రావాల్సిన సొమ్ముల కోసం ఎదురు చూడకుండా ప్రతినెలా నిర్దేశిత సమయానికే వారి ఇళ్ల వద్ద పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. దీంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. ఒకటో తేదీ సెలవుదినం వచ్చినా ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ధరల నియంత్రణతో పాటు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాసరావు, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, బీఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డు సభ్యులు లంకపల్లి మాణిక్యాలరావు, కార్పొరేటర్ గుడిపూడి శ్రీనివాస్, కార్పొరేషన్ కమిషనర్ ఎ. భానుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
