Ticker

6/recent/ticker-posts

పోలవరం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ – టీడీపీలో చేరిన కీలక నాయకులు


ఏలూరు: పోలవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పోలవరం మండలానికి చెందిన పలువురు కీలక వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


ఏలూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ మరియు పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) నాయకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీలో చేరిన వారిలో అల్లు జగన్మోహన్ రావు, నగినడి సత్యనారాయణ, నగినడి ఆంజనేయులు, సానపతి రాంబాబు, బోనుమద్ది సత్యనారాయణ, మాదేపల్లి నరేష్ బాబు, కుప్పల సతీష్, మాదేపల్లి కనకదుర్గ ప్రసాద్, మార్పినాడి పోసరావు, మాదేపల్లి సత్యామణికంఠ, మండిగా సత్య గణేష్ తదితరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలో చేరారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు నాయకులు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ చేరికలతో పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని బొరగం శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పోలవరం మండల పార్టీ అధ్యక్షులు మంగిన వెంకటరమణ, బుట్టాయగూడెం మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు తదితరులు పాల్గొన్నారు.