Ticker

6/recent/ticker-posts

ఏలూరు పాత బస్టాండ్ లో గుప్తా ఫౌండేషన్ వారి ఆర్థిక సౌజన్యంతో ఆర్వో వాటర్ ప్లాంట్ బహుకరణ..


ఏలూరు, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు పాత బస్టాండు నందు శనివారం సాయంత్రం గుప్తా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యాదాత, జల ప్రాణప్రదాత, కళా పోషణ చక్రవర్తి, వైద్య దాత, అపరదానకర్ణ మడుపల్లి మోహన్ గుప్తా వేసవి దాహార్తి తీర్చడం కోసం ప్రయాణికులకు ఆర్వో వాటర్ ప్లాంట్ ను బహుకరించడం జరిగింది. ఈ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు గారు హాజరై వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.‌ 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సేవ చేయడం చాలా ముఖ్యమైన విషయమని, దానికి ఎంతో పెద్ద మనసు ఉంటే తప్ప జరగదని, అటువంటి పెద్ద మనసున్న మహోన్నతమైన వ్యక్తి మడుపల్లి మోహన్ గుప్తా ని పేర్కొన్నారు. వైద్యం, విద్య, మంచినీటి సౌకర్యం ఇంకా అనేక విషయాల్లో వారు చేస్తున్న సేవలు చాలా విశేషమైనవని, వేసవిలో ప్రయాణికుల దాహార్తి తీర్చడం కోసం ఏలూరు పాత బస్టాండ్ లో ఈరోజు ఆర్వో వాటర్ ప్లాంట్ బహుకరించారని కొనియాడారు. 

జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్.కె. షబ్నం మాట్లాడుతూ వేసవిలో ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి మేము ప్రయత్నిస్తున్న తరుణంలో గుప్తా ఫౌండేషన్ వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, వారికి ఆర్టీసీ తరఫున మేము రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుప్తా ఫౌండేషన్ శ్రీనివాస్,  ఏలూరు డిపో మేనేజర్ బి. వాణి, ఎ.ఎం.(టి). యం. రజని, ఏటీఎం, సుబ్బారావు, అకౌంట్స్ ఆఫీసర్ నరసింహమూర్తి, ఇంజినీరింగ్ డి.ఇ. బి. వెంకటేశ్వరరావు, పి.ఆర్.వో. నరసింహం, జనసేన ఏలూరు నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి, గౌరీ శంకర్, సరిది రాజేష్ తదితరులు పాల్గొన్నారు..