ఏలూరు, ఫిబ్రవరి 28: విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు సైన్స్ ఎంతో ఉపయోగపడుతుందని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్ పెదబాబు అన్నారు.
పవర్‌పేటలోని శ్రీ దీప్తి స్కూల్‌లో నిర్వహించిన స్టూడెంట్స్ సైన్స్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా శ్రీ దీప్తి స్కూల్ అనేక మంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చిందని తెలిపారు.
సైన్స్ నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల మేధస్సు పెరుగుతుందని పేర్కొన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు తయారు చేసిన సుమారు 110 ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. భవిష్యత్తులో వీరు మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమానికి తొలుత స్కూల్ డైరెక్టర్ గిరి మాస్టారు ఎస్.ఎం.ఆర్ పెదబాబుకు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, పాము శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
